Breaking News

టీమిండియాతో రెండో టెస్టు.. ఆస్ట్రేలియాకు గుడ్‌ న్యూస్‌!

Published on Sun, 02/12/2023 - 13:32

భారత్‌తో జరిగిన తొలి టెస్టులో ఓటమి పాలై బాధలో ఉన్న ఆస్ట్రేలియాకు గుడ్‌ న్యూస్‌ అందింది. గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన ఆ జట్టు స్టార్‌ పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌.. ఇప్పుడు పూ‍ర్తి ఫిట్‌నెస్‌ సాధించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు ఢిల్లీ వేదికగా జరగనున్న రెండో టెస్టుకు జట్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు మిచెల్‌ స్టార్క్‌ కూడా ఫిట్‌నెస్‌ సాధించినట్లు సమాచారం. అతడు కూడా జట్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉండనున్నట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా తమ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఇక ఇది ఇలా ఉండగా.. రెండో టెస్టుకు ముందు ఆస్ట్రేలియా ఆదనంగా మరో స్పిన్నర్‌ మాథ్యూ కుహ్నెమన్‌ను జట్టులో చేర్చుకోనున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఢిల్లీ వేదికగా శుక్రవారం(ఫిబ్రవరి 17) నుంచి ప్రారంభం కానుంది.

టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు
ప్యాట్‌ కమిన్స్‌(కెప్టెన్‌), స్టీవ్‌ స్మిత్‌ (వైస్‌ కెప్టెన్‌), ఆష్టన్‌ అగర్‌(లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌), స్కాట్‌ బోలాండ్‌, అలెక్స్‌ క్యారీ, కామెరాన్‌ గ్రీన్‌, పీటర్‌ హాండ్స్‌కోంబ్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, ట్రవిస్‌ హెడ్‌, ఉస్మాన్‌ ఖవాజా, మార్నస్‌ లబుషేన్‌, నాథన్‌ లియాన్‌(రైట్‌ ఆర్మ్‌ ఆఫ్‌బ్రేక్‌ స్పిన్నర్‌), లాన్స్‌ మోరిస్‌, టాడ్‌ మర్ఫీ(రైట్‌ ఆర్మ్‌ ఆఫ్‌బ్రేక్‌ స్పిన్నర్‌), మాథ్యూ రేన్షా, మిచెల్‌ స్టార్క్‌, మిచెల్‌ స్వెప్సన్‌(రైట్‌ ఆర్మ్‌ లెగ్‌బ్రేక్‌ స్పిన్నర్‌), డేవిడ్‌ వార్నర్‌,మాథ్యూ కుహ్నెమన్‌
చదవండి: Wasim Jaffer: ఏక కాలంలో ఒకరిని మెచ్చుకొని.. మరొకరిని తిట్టుకొని

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)