Breaking News

సిరాజ్ మంచి వ్యక్తిత్వం కలవాడు: జోష్‌ హాజిల్‌వుడ్‌

Published on Tue, 12/10/2024 - 12:58

అడిలైడ్ వేదిక‌గా జ‌రిగిన పింక్ బాల్ టెస్టుతో ఆస్ట్రేలియా అభిమానుల‌కు టీమిండియా స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్  విల‌న్‌గా మారిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆసీస్ స్టార్ ట్రావిస్ హెడ్‌తో సిరాజ్ వాగ్వాద‌మే ఇందుకు కార‌ణం.

ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసిన అనంత‌రం సిరాజ్‌ చూపించిన అత్యుత్సాహం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు గురిచేసింది. హెడ్ కంటే ముందు మార్న‌స్ ల‌బుషేన్ ప‌ట్ల కూడా ఈ హైద‌రాబాదీ అనుచితంగా ప్ర‌వ‌ర్తించాడు. దీంతో ఆసీస్ ఆట‌గాళ్ల‌తో పాటు ఫ్యాన్స్ సైతం సిరాజ్‌పై అగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

మ్యాచ్ జ‌రుగుతుండ‌గానే అడిలైడ్ ప్రేక్ష‌కులు సిరాజ్‌ను స్లెడ్జ్ చేశారు. సిరాజ్ తీరును సునీల్ గ‌వాస్క‌ర్ వంటి భార‌త దిగ్గ‌జాలు కూడా త‌ప్పుబ‌ట్టారు.  ఆఖ‌రికి ఐసీసీ కూడా అత‌డికి షాక్ ఇచ్చింది. సిరాజ్‌ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించింది. 

ఈ నేప‌థ్యంలో సిరాజ్‌ను ఆసీస్ స్టార్ ఫాస్ట్ బౌల‌ర్ జోష‌ల్ హాజిల్‌వుడ్ ప్రశంసించడం గమనార్హం. అత‌డు మంచి వ్యక్తిత్వం కలవాడని కొనియాడాడు. కాగా సిరాజ్‌-హాజిల్‌వుడ్ ఇద్ద‌రూ ఐపీఎల్‌లో ఆర్సీబీ త‌ర‌పున క‌లిసి ఆడిన సంగ‌తి తెలిసిందే.

"సిరాజ్ చాలా మంచివాడు. కానీ కొన్నిసార్లు దూకుడుగా కూడా వ్య‌వ‌హ‌రిస్తాడు. సిరాజ్‌తో కలిసి ఆర్సీబీలో గడిపిన సమయాన్ని బాగా ఎంజాయ్‌ చేశాను. విరాట్ కోహ్లిలా కూడా అత‌డిది దూకుడైన స్వ‌భావం. చాలా ఉద్వేగభరితమైనవాడు.

అత‌డు మైదానంలో ఉన్నంత సేపు త‌న స్వ‌భావంతో అభిమానుల‌ను అల‌రిస్తాడు. సిరాజ్ గ‌త కొన్ని ఐపీఎల్ సీజ‌న్ల‌లో అద్భ‌త‌మైన బౌలింగ్ స్పెల్‌లు వేశాడు అని హాజిల్‌వుడ్ పేర్కొన్నాడు. కాగా హాజిల్‌వుడ్ గాయం కార‌ణంగా రెండో టెస్టుకు దూర‌మైన సంగ‌తి తెలిసిందే. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)