Breaking News

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియాకు గుడ్‌న్యూస్‌!

Published on Wed, 05/31/2023 - 10:56

టీమిండియాతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియాకు గుడ్‌న్యూస్‌ అందింది. ఆ జట్టు పేసర్‌ జోష్ హేజిల్‌వుడ్ ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించినట్లు తెలుస్తోంది. హాజిల్‌వుడ్‌ కాలి మడమ గాయంతో గత కొంతకాలంగా భాదపడతున్నాడు. ఈ క్రమంలో పూర్తిఫిట్‌నెస్‌ సాధించకపోయనప్పటికీ ఐపీఎల్‌-2023లో ఆర్సీబీ తరపున ఆడేందుకు భారత్‌కు వచ్చాడు.

అయితే కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన హాజిల్‌వుడ్‌ గాయం తిరగబెట్టడంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్‌-2023 మధ్యలోనే తన స్వదేశానికి పయనమయ్యాడు. ఈ క్రమంలో అతడు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కూడా దూరం కానున్నాడని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు అతడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించి.. నెట్స్‌లో తీవ్రంగా చమటోడ్చుతున్నాడు. ఇక తన ఫిట్‌నెస్‌పై హాజిల్‌వుడ్‌ తాజాగా స్పందించాడు.

"నేను ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాను. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఇంకా వారం రోజుల సమయం ఉంది.  ఫైనల్‌ మ్యాచ్‌ ప్రారంభం వరకు ప్రతీ సెషన్‌లో ప్రాక్టీస్‌ చేయడమే నా పని. టెస్టు క్రికెట్‌కు టీ20 క్రికెట్‌ పూర్తి భిన్నం. టీ20ల్లో మన బౌలింగ్‌లో చాలా వేరియషన్స్‌ చూపించాలి. వైడ్‌ యార్కర్లు, బౌన్సర్లు, స్లోయర్‌ బాల్స్‌ వేయడానికి చాలా కష్టపడాలి. ఈ క్రమంలో బౌలర్లకు తమ గాయాలు తిరగబెట్టే అవకాశం ఉందని" ఐసీసీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హాజిల్‌వుడ్‌ పేర్కొన్నాడు.
చదవండి: Asia Cup 2023: శ్రీలంకలో ఆసియాకప్‌.. జరుగుతుందా? లేదా?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)