ఆసీస్‌తో సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ ఎదురుదెబ్బ​

Published on Thu, 09/05/2024 - 15:22

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఇంగ్లండ్‌ సారధి జోస్‌ బట్లర్‌ ఆసీస్‌తో టీ20 సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. బట్లర్‌.. టీ20 సిరీస్‌తో పాటు తదనంతరం జరిగే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. 

బట్లర్‌ గైర్హాజరీలో ఫిల్‌ సాల్ట్‌ ఇంగ్లండ్‌ టీ20 జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు గురువారం (సెప్టెంబర్‌ 5) అధికారికంగా ప్రకటించింది. బట్లర్‌ స్థానాన్ని ఆల్‌రౌండర్‌ జేమీ ఓవర్టన్‌ భర్తీ చేయనున్నాడు. 

కాగా, మూడు టీ20లు, ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా జట్టు సెప్టెంబర్‌ 11 నుంచి ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో తొలుత టీ20లు జరుగుతాయి. సెప్టెంబర్‌ 11, 13, 15 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. అనంతరం సెప్టెంబర్‌ 19, 21, 24, 27, 29 తేదీల్లో వన్డే సిరీస్‌ జరుగనుంది.

ఇంగ్లండ్ టీ20 జట్టు: ఫిల్ సాల్ట్ (కెప్టెన్‌), జోఫ్రా ఆర్చర్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్సే, జోర్డాన్ కాక్స్, సామ్ కర్రన్, జోష్ హల్, విల్ జాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, సాకిబ్ మహమూద్, డాన్ మౌస్లీ, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీ, జాన్ టర్నర్

ఇంగ్లండ్ వన్డే జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్‌), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, జోర్డాన్ కాక్స్, బెన్ డకెట్, జోష్ హల్, విల్ జాక్స్, మాథ్యూ పాట్స్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జేమీ స్మిత్, రీస్ టోప్లీ, జాన్ టర్నర్

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)