చరిత్ర సృష్టించిన జోస్ బట్లర్‌.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా

Published on Sun, 07/12/2026 - 13:44

టీమిండియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-0 తేడాతో ఇంగ్లండ్‌ సొంతం చేసుకుంది. సౌతాంప్టాన్‌ వేదికగా జరిగిన ఐదో టీ20లోనూ ఆతిథ్య ఇంగ్లండ్‌ అదరగొట్టింది. భారత్‌ను 56 పరుగుల తేడాతో బ్రూక్‌ సేన చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ స్టార్ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.

గత కొన్నాళ్లగా పేలవ ఫామ్‌తో సతమవుతున్న బట్లర్‌.. ఈ మ్యాచ్‌లో మాత్రం భారత బౌలర్లను ఉతిరాకేశాడు. రోజ్‌బౌల్‌ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. బట్లర్‌ కేవలం 64 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్స్‌లతో 131 పరుగులు చేశాడు. ఈ క్రమంలో బట్లర్‌ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

బట్లర్‌ సాధించిన రికార్డులు ఇవే
👉అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో భారత స్టార్ బ్యాటర్‌ విరాట్ కోహ్లిని అధిగమించి మూడో స్ధానానికి బట్లర్ చేరుకున్నాడు.

👉108 పరుగల వ్యక్తిగత స్కోర్ వద్ద బట్లర్ ఈ ఫీట్ సాధించాడు. విరాట్ తన టీ20 కెరీర్‌లో 4,188 పరుగులు చేయగా.. బట్లర్ ఇప్పటివరకు 4,212 రన్స్ చేశాడు. ఈ జాబితాలో అగ్రస్ధానంలో బాబర్ ఆజం(4,596) ఉండగా, రెండో స్ధానంలో రోహిత్ శర్మ(4,231) కొనసాగుతున్నాడు.

👉అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా బట్లర్‌ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు వెస్టిండీస్ స్టార్ ఓపెనర్ ఎవిన్ లూయిస్‌(125 నాటౌట్‌) పేరిట ఉండేది.

👉తాజా మ్యాచ్‌తో లూయిస్ ఆల్‌టైమ్ రికార్డును జోస్ ది బాస్(131) బ్రేక్ చేశాడు. టీ20ల్లో బట్లర్‌కే ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం. అదేవిధంగా ఇంగ్లండ్ తరపున అత్యధిక స్కోర్ సాధించిన రెండో బ్యాటర్‌గా బట్లర్ నిలిచాడు. తొలి స్దానంలో ఫిల్ సాల్ట్‌(141) ఉన్నాడు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)