Breaking News

దురదృష్టవంతుల లిస్ట్‌లో బెయిర్‌ స్టో.. ఏడో క్రికెటర్‌గా

Published on Sat, 07/22/2023 - 08:50

ఇంగ్లండ్‌ వికెట్‌కీపర్‌ జానీ బెయిర్‌ స్టో బ్యాడ్‌లక్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారాడు. లార్డ్స్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో బెయిర్‌ స్టో ఔట్‌ ఎంత వివాదాస్పదంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓవర్‌ పూర్తయిందని భావించిన బెయిర్‌ స్టో క్రీజు బయటకు రాగా.. ఆసీస్‌ కీపర్‌ అలెక్స్‌ కేరీ బంతిని నేరుగా వికెట్ల మీదకు విసిరాడు. బంతి ఇంకా డెడ్‌ కాలేదని.. రూల్‌ ప్రకారం బెయిర్‌ స్టో ఔట్‌ అని అంపైర్‌ ప్రకటించాడు. దీంతో చేసేదేం లేక బెయిర్‌ స్టో పెవిలియన్‌ చేరాడు. అయితే ఈ ఔట్‌పై ఆ తర్వాత చాలా పెద్ద చర్చే జరిగింది.

సహచర బ్యాటర్‌ రూపంలో వెంటాడిన దురదృష్టం..
తాజాగా బెయిర్‌ స్టోను మరోసారి దురదృష్టం వెంటాడింది. అయితే ఈసారి ఔట్‌ రూపంలో కాదు.. సెంచరీ రూపంలో. సెంచరీ చేసే అవకాశమున్నా ఆ అదృష్టానికి నోచుకోలేకపోయాడు. కేవలం ఒక్క పరుగు దూరంలో సెంచరీకి దూరమయ్యాడు. మరి ఔట్‌ అయ్యాడా అంటే అదీ లేదు. తన సహచర బ్యాటర్‌ చివరి వికెట్‌గా వెనుదిరగడంతో బెయిర్‌ స్టో 99 పరుగులు నాటౌట్‌గా నిలవాల్సి వచ్చింది. దీన్నిబట్టి చూస్తే  గాయంతో ఏడాదిన్నర పాటు ఆటకు దూరమైన బెయిర్‌ స్టో రీఎంట్రీ దగ్గరి నుంచి బ్యాడ్‌లక్‌ వెంటాడుతన్నట్లుగా అనిపిస్తోంది. ఒక్క పరుగుతో సెంచరీ మిస్‌ చేసుకున్నప్పటికి బెయిర్‌ స్టో తన ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌ను పటిష్ట స్థితిలో నిలిపాడు.

బెయిర్‌స్టో ఇన్నింగ్స్‌తో 592 పరుగులకి ఆలౌట్ అయిన  ఇంగ్లండ్‌ ఆస్ట్రేలియాపై  తొలి ఇన్నింగ్స్‌లో 273 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. జాక్‌ క్రాలీ 189, మొయిన్ ఆలీ 54, జో రూట్ 84, హారీ బ్రూక్ 61, బెన్ స్టోక్స్ 51 పరుగులు చేసి ఔటయ్యారు. క్రిస్‌ వోక్స్‌,బ్రాడ్, అండర్సన్‌లతో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. జానీ బెయిర్‌ స్టో సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉన్న సమయంలో జేమ్స్ అండర్సన్‌ని కామెరూన్ గ్రీన్ అవుట్ చేయడంతో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది.

99 వద్ద నాటౌట్‌గా మిగిలిన ఏడో బ్యాటర్‌గా..


టెస్టు క్రికెట్ చరిత్రలో 99 పరుగుల వద్ద నాటౌట్‌గా మిగిలిన ఏడో క్రికెటర్‌గా జానీ బెయిర్‌స్టో నిలిచాడు. ఇంతకుముందు జోఫ్రె బాయ్‌కాట్, స్టీవ్ వా, అలెక్స్ టూడర్, షాన్ పోలాక్, ఆండ్రూ హాల్, మిస్బా వుల్ హక్‌లు 99 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. 

ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 317 పరుగులకు ఆలౌట్ అయ్యింది.మార్నస్ లబుషేన్ 51, మిచెల్ మార్ష్ 51, ట్రావిస్ హెడ్ 48, స్టీవ్ స్మిత్ 41, మిచెల్ స్టార్క్ 36, డేవిడ్ వార్నర్ 32, అలెక్స్ క్యారీ 20 పరుగులు చేసి సంయుక్తంగా రాణించారు. క్రిస్ వోక్స్ 5 వికెట్లు తీశాడు.  273 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆస్ట్రేలియా మూడోరోజు ఆట ముగిసే సమయానికి 41 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసిది. క్రీజులో మార్నస్‌ లబుషేన్‌(44 బ్యాటింగ్‌), మిచెల్‌ మార్ష్‌ ఒక్క పరుగుతో ఉన్నారు. ఆసీస్‌ ఇంకా 162 పరుగులు వెనుకబడి ఉంది.

చదవండి: #Jadeja: ఔటయ్యింది ఒక బంతికి.. చూపించింది వేరే బంతిని

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)