ఎందుకు భయ్యా ఈ రిస్క్‌ షాట్‌లు.. కొంచెం తేడా జరిగుంటే? వీడియో వైరల్‌

Published on Mon, 08/28/2023 - 11:40

కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో​ భాగంగా సెయింట్ లూసియా కింగ్స్, ట్రింబాగో నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ భయంకర సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో సెయింట్ లూసియా కింగ్స్‌ బ్యాటర్‌, విండీస్‌ స్టార్‌ ఓపెనర్‌ జాన్సన్ చార్లెస్‌ పెను ప్రమాదం తృటిలో తప్పించుకున్నాడు. మైదానంలో బౌలర్లను ఎదుర్కొనేటప్పుడు బ్యాటర్లు చాలా జాగ్రత్త వహించాలి.

ముఖ్యంగా ఫాస్ట్‌ బౌలర్లకు వ్యతిరేకంగా విభిన్న షాట్‌లు ఆడాలనుకున్నప్పుడు బ్యాటర్లకు కొంచెం తెలివితో పాటు ప్రాక్టీస్‌ కూడా ఉండాలి. ఏదో గుడ్డిగా ప్రయోగాలు చేద్దామంటే గాయాల బారిన పడక తప్పదు. ఇప్పటికే ఇటువంటి ప్రయోగాలు చేసి చాలా మంది ఆటగాళ్లు గాయపడిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా చార్లెస్‌ విషయంలో కూడా ఇదే జరిగింది. అయితే అదృష్టవశాత్తూ అతడికి ఎటువంటి గాయాలు కాలేదు.

ఏం జరిగిదంటే?
సెయింట్ లూసియా ఇన్నింగ్స్‌ 12 ఓవర్‌లో  డ్వేన్ బ్రావో నాలుగో బంతిని ఫుల్‌ టాస్‌గా సంధించాడు. ఈ క్రమంలో  చార్లెస్ బంతిని వికెట్‌ కీపర్‌ పై నుంచి పంపేందుకు స్కూప్‌ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే బంతిని పూర్తిగా మిస్ అయ్యాడు. ఈ క్రమంలో బంతి వచ్చి అతడి గడ్డానికి తాకింది. బంతి తగిలిన దెబ్బకు అతని హెల్మెట్‌ ఎగిరి పడింది.

అయితే ఈ సమయంలో తెలివిగా వ్యవహరించిన చార్లెస్..  హెల్మెట్‌ వికెట్లపై పడకుండా కాలితో తన్నాడు. కాగా వెంటనే ఫిజియో పరిగెత్తు కుంటూ వచ్చి అతడిని పరీక్షించాడు. అతడికి ఎటువంటి గాయం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియెపై నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. "మనకు రానిది అవసరమా భయ్యా.. కొంచెం తేడా జరిగింటే ఏంటి పరిస్థితి" అని ఓ యూజర్‌ కామెంట్‌ చేశాడు.
చదవండి: భారత ట్రిపుల్‌ సెంచరీ వీరుడి సంచలన నిర్ణయం.. ఇకపై!

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)