Breaking News

CWC 2023: ప్రపంచకప్‌ జట్టుతో స్టార్‌ పేసర్‌

Published on Mon, 09/18/2023 - 16:11

స్టార్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ ఇంగ్లండ్‌ ప్రపంచ కప్‌ జట్టుతో పాటు భారత్‌కు బయల్దేరనున్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్‌ చీఫ్‌ సెలక్టర్‌ లూక్‌ రైట్‌ వెల్లడించాడు. ఆర్చర్‌ గాయం​ నుంచి పూర్తి కోలుకోనప్పటికీ.. ట్రావెలింగ్‌ రిజర్వ్‌గా ఇంగ్లండ్‌ జట్టుతో పాటు ఉంటాడని ప్రకటించాడు. టీమ్‌తో ఉంటూనే ఆర్చర్‌ రిహాబ్‌లో కొనసాగుతాడని పేర్కొన్నాడు. ప్రపంచకప్‌ జట్టులో దురదృష్టవశాత్తు ఎవరైనా గాయపడితే ఆర్చర్‌ అందుబాటులో ఉంటాడని తెలిపాడు.

జట్టుతో పాటు ఉంటే ఆర్చర్‌ త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని, అతను పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తే వరల్డ్‌కప్‌లో ఏ సమయంలోనైనా అతని సేవలు వినియోగించుకుంటామని అన్నాడు. ఆర్చర్‌ త్వరగా కోలుకునేందుకు తమ మెడికల్‌ టీమ్‌ చేయాల్సిందంతా చేస్తుందని తెలిపాడు. ఇంగ్లండ్‌ వరల్డ్‌కప్‌ జట్టును ప్రకటించే సందర్భంలో లూక్‌ రైట్‌ ఈ విషయాలను వెల్లడించాడు.

కాగా, ఇంగ్లండ్‌ సెలెక్టర్లు నిన్న ప్రపంచకప్‌ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ముందుగా ప్రకటించిన జట్టులో సెలెక్టర్లు ఓ కీలక మార్పు చేశారు. స్టార్‌ బ్యాటర్‌ జేసన్‌ రాయ్‌పై వేటు వేసి యువ ఆటగాడు హ్యారీ బ్రూక్‌ను వరల్డ్‌కప్‌ జట్టులోకి తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా వెన్నునొప్పితో బాధపడుతున్న రాయ్‌.. ఎంతకీ కోలుకోకపోవడంతో ఈ  నిర్ణయం తీసుకున్నారు.

ఇదిలా ఉంటే, ఆర్చర్‌ గత కొన్ని నెలలుగా వేర్వేరు గాయాల కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఆర్చర్‌ గాయాల జాబితాలో కుడి మోచేతి ఫ్రాక్చర్‌ ప్రధానమైంది. ఈ గాయం కారణంగానే అతను ప్రతిష్టాత్మక యాషెస్‌ సహా పలు కీలక సిరీస్‌లు, ఐపీఎల్‌ను మిస్‌ అయ్యాడు. ప్రస్తుతం ఆర్చర్‌ గాయాల నుంచి కోలుకుంటూ రిహాబ్‌లో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్‌ సెలెక్టర్ల తాజా నిర్ణయంతో ఆర్చర్‌ ఇంగ్లండ్‌ జట్టుతో పాటు వరల్డ్‌కప్‌కు వేదిక అయిన భారత్‌కు వెళ్తాడు. 

ఇంగ్లండ్‌ ప్రపంచ కప్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో, జో రూట్, డేవిడ్ మలాన్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టాప్లే, క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, డేవిడ్‌ విల్లీ, సామ్ కర్రన్

ట్రావెలింగ్‌ రిజర్వ్‌: జోఫ్రా ఆర్చర్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)