Breaking News

జోఫ్రా అర్చ‌ర్ చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్ర‌లోనే

Published on Sun, 03/23/2025 - 23:04

ఐపీఎల్‌-2025లో ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ స్టార్ పేస‌ర్, జోఫ్రా ఆర్చ‌ర్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. ఈ మ్యాచ్‌లో ఆర్చర్‌కు ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్లు చుక్క‌లు చూపించారు. ఈ ఇంగ్లండ్ ఫాస్ట్ బౌల‌ర్ తన నాలుగు ఓవ‌ర్ల కోటాలో ఏకంగా 76 పరుగులు సమర్పించుకున్నాడు.

తొలి ఓవర్ లోనే 23 పరుగులు ఇచ్చిన‌ ఆర్చర్.. ఆ తర్వాత మూడు ఓవర్ల‌లో వ‌రుస‌గా 12, 22,23 పరుగులు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో ఆర్చ‌ర్ ఓ చెత్త రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త గణాంకాలు నమోదు చేసిన బౌల‌ర్‌గా ఆర్చ‌ర్ రికార్డుల‌కెక్కాడు.

ఇప్ప‌టివ‌ర‌కు ఈ రికార్డు టీమిండియా వెట‌ర‌న్ పేస‌ర్ మొహిత్ శ‌ర్మ పేరిట ఉండేది. ఐపీఎల్‌-2024 సీజ‌న్‌లో గుజ‌రాత్ టైటాన్స్ త‌ర‌పున ఆడిన మోహిత్ శర్మ.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 73 పరుగులు ఇచ్చాడు. తాజా మ్యాచ్‌తో మొహిత్ రికార్డును ఆర్చ‌ర్(78) బ్రేక్ చేశాడు. 

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. రాజ‌స్తాన్‌పై 44 ప‌రుగుల తేడాతో ఎస్ఆర్‌హెచ్ ఘ‌న విజ‌యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్‌.. ఇషాన్ కిష‌న్‌(106 నాటౌట్‌) సెంచ‌రీతో చెల‌రేగ‌డంతో నిర్ణీత ఓవ‌ర్ల‌లో  6 వికెట్ల నష్టానికి 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. కిష‌న్‌తో పాటు ట్రావిస్‌ హెడ్‌(67), క్లాసెన్‌(34), నితీశ్‌ కుమార్‌(30) పరుగులతో రాణించారు. రాజస్తాన్‌ బౌలర్లలో తుషార్‌ దేశ్‌పాండే మూడు వికెట్లు పడగొట్టగా.. థీక్షణ రెండు, సందీప్‌ శర్మ ఒక్క వికెట్‌ సాధించారు.

అనంత‌రం 287 ప‌రుగుల ల‌క్ష్యంతో బరిలోకి దిగిన రాజ‌స్తాన్ 6 వికెట్లు కోల్పోయి 242 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌ల్గింది. ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్ల‌లో సిమర్జీత్ సింగ్, హ‌ర్ష‌ల్ ప‌టేల్ త‌లా రెండు వికెట్లు ప‌డగొట్టగా.. షమీ, జంపా చెరో వికెట్ సాధించారు. రాజ‌స్తాన్ బ్యాట‌ర్ల‌లో ధ్రువ్ జురెల్(70) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు.
చ‌ద‌వండి: IPL 2025: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్‌.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)