Breaking News

నాలుగేళ్ల తర్వాత రీ ఎంట్రీ.. క‌ట్ చేస్తే! తొలి ఓవ‌ర్‌లోనే భారత్‌కు షా​కిచ్చాడు

Published on Fri, 07/11/2025 - 20:20

ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తన పునరాగమనాన్ని ఘనంగా ఆరంభించాడు. నాలుగేళ్ల తర్వాత ఇంగ్లండ్ టెస్టు జట్టులోకి వచ్చిన ఆర్చర్‌.. తన వేసిన తొలి ఓవర్‌లోనే వికెట్ పడగొట్టి సత్తాచాటాడు. లార్డ్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్‌కు ఆదిరిపోయే ఆరంభాన్ని ఆర్చర్ అందించాడు.

తొలి ఇన్నింగ్స్‌లో తన వేసిన మొదటి ఓవర్‌లోనే స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌(13)ను ఔట్ చేసి టీమిండియాకు షాకిచ్చాడు. భారత ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన ఆర్చర్‌.. మూడో బంతిని జైశ్వాల్‌కు 145 కి.మీ వేగంతో సీమ్ ఆప్ డెలివరీగా సంధించాడు.

ఆఫ్ స్టంప్ దిశగా పడిన బంతిని జైశ్వాల్ బ్యాక్ ఫుట్ నుంచి లెగ్‌సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్‌లో ఉన్న హ్యారీ బ్రూక్ చేతికి వెళ్లింది. దీంతో 1596 రోజుల త‌ర్వాత అతడి ఖాతాలో తొలి టెస్టు వికెట్ చేరింది.

ఆర్చర్‌ చివరగా 2021లో ఇంగ్లండ్‌ తరపున టెస్టు మ్యాచ్‌ ఆడాడు. ఆ తర్వాత గాయాల కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. ఏడాది క్రితం వైట్‌బాల్‌ జట్టులోకి వచ్చినప్పటికి.. టెస్టుల్లో మాత్రం ఆడడం నాలుగేళ్ల తర్వాత ఇదే తొలిసారి.

ఇంగ్లండ్‌ స్కోరంతంటే?
తొలి ఇన్నింగ్స్‌లో 387 ప‌రుగుల‌కు ఇంగ్లండ్ ఆలౌటైంది.  251/4 ఓవ‌ర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆట‌ను ప్రారంభించిన ఇంగ్లీష్ జ‌ట్టు.. అద‌నంగా 136 ప‌రుగులు చేసి ఆలౌటైంది. జో రూట్‌(104) టాప్ స్కోరర్‌గా నిలవగా..  అత‌డితో పాటు బ్రైడ‌న్ కార్స్‌(56), జేమీ స్మిత్‌(51), ఓలీ పోప్‌(44), స్టోక్స్‌(44) రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో జ‌స్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. నితీశ్, సిరాజ్‌ తలా రెండు వికెట్లు సాధించారు.


 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)