Breaking News

జో రూట్‌ అరుదైన ఘనత.. లారా ఆల్‌టైమ్‌ రికార్డు బద్దలు

Published on Sat, 07/27/2024 - 19:32

ఇంగ్లండ్ స్టార్ బ్యాట‌ర్ జో రూట్ మ‌రో అరుదైన ఘ‌న‌త సాధించాడు. టెస్టు క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ఏడో బ్యాట‌ర్‌గా జో రూట్ రికార్డుల‌కెక్కాడు. ఎడ్జ్‌బాస్ట‌న్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టులో 12 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోర్ వ‌ద్ద రూట్ ఈ అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. 

ఇప్పటివరకు 143 మ్యాచ్‌ (261 టెస్టు ఇన్నింగ్స్‌లు) లు ఆడిన రూట్ 11954 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా పేరిట ఉండేది. లారా 131 మ్యాచ్‌ల్లో 11953 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో లారా ఆల్‌టైమ్ రి​కార్డును రూట్ బ్రేక్ చేశాడు. 

ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌(15,921) అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. సచిన్‌ తర్వాతి స్ధానాల్లో రికీ పాంటింగ్‌(13,378), జాక్వెస్ కల్లిస్(13, 289), రాహుల్‌ ద్రవిడ్‌(13,288), అలిస్టర్ కుక్(12,472), కుమార్ సంగక్కర(12,400) ఉన్నారు. ఇక విండీస్‌తో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రూట్‌ 87 పరుగులు చేసి ఔటయ్యాడు. రూట్‌ టెస్టు కెరీర్‌లో 32 సెంచరీలు కూడా ఉన్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)