Breaking News

'నగ్నంగా నడుస్తానని సవాల్'... హేడెన్‌ పరువు కాపాడిన జో రూట్

Published on Thu, 12/04/2025 - 19:30

యాషెస్ సిరీస్ 2025-26లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ వెటరన్ జో రూట్ సెంచరీతో సత్తాచాటాడు. దీంతో రూట్ ఆసీస్ గడ్డపై తన 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరిదించాడు. రూట్‌కు ఆస్ట్రేలియాలో ఏ ఫార్మాట్‌లోనైనా ఇదే తొలి సెంచరీ. అతడు ప్రస్తుతం 135 పరుగులతో అజేయంగా క్రీజులో ఉన్నాడు. అయితే రూట్ తన సెంచరీతో ఆసీస్ దిగ్గజం మాథ్యూ హేడెన్‌ ‌ను న్యూడ్ రన్ నుంచి కాపాడాడు.

హేడెన్‌  సవాల్‌..
ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌కు ముందు రూట్‌పై ఒత్తిడి పెంచేలా హేడెన్‌  ఓ సవాల్ విసిరాడు. ఈ టూర్‌లో రూట్ సెంచరీ చేయకపోతే మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో నగ్నంగా నడుస్తానని ఛాలెంజ్ చేశాడు. అందుకు స్పందిచిన హేడెన్‌  కుమార్తె గ్రేస్ హేడెన్‌ ‌.. ప్లీజ్ రూట్ సెంచరీ చేసి మా నాన్నను కాపాడు అంటూ ట్వీట్ చేసింది. ఇప్పుడు రూట్ నిజంగానే సెంచరీ చేసి హేడెన్‌ ‌ను సేవ్ చేశాడు.

గత 12 ఏళ్లగా ఆస్ట్రేలియా గడ్డపై రూట్ సెంచరీ కోసం పోరాడతున్నాడు. ఇంతకుముందు వరకు ఆసీస్‌లో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 89గా ఉంది. ఎట్టకేలకు మూడెంకల స్కోర్‌ను అందుకుని తన సుదీర్ఘ స్వప్నాన్ని అతడు నేరవేర్చుకున్నాడు. రూట్ సెంచ‌రీ చేయ‌గానే హేడెన్ కామెంట‌రీ బాక్స్ నుంచి బ‌య‌ట‌కు సెల‌బ్రేష‌న్ చేసుకుంది. అనంత‌రం ఇంగ్లండ్ లెజెండ్‌ను అత‌డు అభినందించాడు.

"ఆస్ట్రేలియాలో ఎట్ట‌కేల‌కు సెంచ‌రీ చేసిన జో రూట్‌కు నా అభినంద‌న‌లు. మిత్రమా  కొంచెం ఆలస్యమైంది. కానీ ఈ సెంచ‌రీ కోసం నేను ఎంత‌గానో ఎదురు చూశాను. ప‌ది ఏభైలు త‌ర్వాత నీవు అనుకున్న ల‌క్ష్యానికి చేరుకున్నావు. చాలా సంతోషంగా ఉంది" అని హేడెన్ ఇంగ్లండ్ క్రికెట్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నాడు.
 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)