Breaking News

జో రూట్‌ ప్రపంచ రికార్డు..

Published on Fri, 07/11/2025 - 21:30

లార్డ్స్ వేదిక‌గా టీమిండియాతో జ‌రుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ బ్యాట‌ర్ జో రూట్ త‌న రికార్డుల వేట‌ను కొన‌సాగిస్తున్నాడు. ఈ ఇంగ్లండ్ వెట‌ర‌న్ మ‌రో అరుదైన ఘ‌న‌త‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో అత్య‌ధిక అవుట్‌ఫీల్డ్ క్యాచ్‌లు అందుకున్న ప్లేయ‌ర్‌గా వ‌ర‌ల్డ్ రికార్డు సృష్టించాడు.

భారత తొలి ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయ‌ర్ క్యాచ్‌ను తీసుకున్న త‌ర్వాత ఈ ఫీట్‌ను రూట్ సాధించాడు. సెకెండ్‌ స్లిప్‌లో రూట్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌తో మెరిశాడు. రూట్ ఇప్ప‌టివ‌ర‌కు ఔట్ ఫీల్డ్‌లో 211 క్యాచ్‌లు అందుకున్నాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్ర‌విడ్‌(210) పేరిట ఉండేది.

తాజా మ్యాచ్‌తో ద్రవిడ్ రికార్డును రూట్ బ్రేక్ చేశాడు. అటు బ్యాటింగ్‌లోనూ రూట్ స‌త్తాచాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో అద్బుత‌మైన సెంచ‌రీతో రూట్‌(104) మెరిశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 387 ప‌రుగుల భారీ స్కోర్ చేయ‌గ‌ల్గింది. అత‌డితో పాటు బ్రైడ‌న్ కార్స్‌(56), జేమీ స్మిత్‌(51), ఓలీ పోప్‌(44), స్టోక్స్‌(44) రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో జ‌స్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. నితీశ్, సిరాజ్‌ తలా రెండు వికెట్లు సాధించారు.

టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక అవుట్‌ఫీల్డ్ క్యాచ్‌లు అందుకున్న ప్లేయ‌ర్లు వీరే..
211*జో రూట్
210 రాహుల్ ద్రావిడ్
205 మహేల జయవర్ధనే
200 స్టీవెన్ స్మిత్
200 జాక్వెస్ కాలిస్
196 రికీ పాంటింగ్

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)