Breaking News

జో రూట్ అరుదైన ఘ‌న‌త‌.. చంద్ర‌పాల్ రికార్డు బ‌ద్ద‌లు

Published on Thu, 08/29/2024 - 19:43

ఇంగ్లండ్ స్టార్ క్రికెట‌ర్ జో రూట్ త‌న అద్భుత ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. లార్డ్స్ వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో రూట్ హాఫ్ సెంచ‌రీతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో కీల‌క స‌మ‌యంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన అత‌డు త‌న హాఫ్ సెంచరీతో జ‌ట్టును ఆదుకున్నాడు.

 84 బంతుల్లో 6 ఫోర్లతో రూట్ త‌న హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ సిరీస్‌లో ఇది రూట్ రెండో హాఫ్ సెంచ‌రీ. అంత‌కుముందు తొలి టెస్టులో కూడా ఆర్ధ‌శ‌త‌కంతో జో మెరిశాడు.

రూట్ అరుదైన ఘ‌న‌త‌.. 
ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచ‌రీ సాధించిన రూట్ మ‌రో అరుదైన ఘ‌న‌త‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో అత్య‌ధిక ఫిప్టీ ప్ల‌స్ స్కోర్లు సాధించిన ఐదో క్రికెటర్‌గా రూట్ రికార్డుల‌కెక్కాడు. ఇప్ప‌టివ‌ర‌కు 147 మ్యాచ్‌ల్లో 97*సార్లు ఏభై పైగా రూట్ ప‌రుగులు సాధించాడు.

ఇంత‌కుముందు ఈ రికార్డు విండీస్ క్రికెట్ దిగ్గ‌జం శివనారాయణ చందర్‌పాల్ పేరిట ఉండేది. చంద‌ర్‌పాల్ త‌న కెరీర్‌లో 164 టెస్టుల్లో 96 సార్లు ఫిప్టీ ప్ల‌స్ స్కోర్లు సాధించాడు. అయితే తాజా మ్యాచ్‌తో చంద‌ర్‌పాల్‌ను రూట్ అధిగ‌మించాడు.

 ఇక ఈ అరుదైన ఘ‌న‌త సాధించిన జాబితాలో భార‌త క్రికెట్ లెజెండ్ స‌చిన్ టెండూల్క‌ర్(119 ఫిప్టీ ప్ల‌స్ స్కోర్లు) ఉన్నాడు. ఆ త‌ర్వాత వ‌రుస‌గా క‌ల్లిస్‌(103), పాంటింగ్‌(103), ద్ర‌విడ్‌(99) ఉన్నారు. కాగా రూట్ కెరీర్‌లో 32 టెస్టు సెంచ‌రీలు ఉన్నాయి.
చదవండి: 'బాబ‌ర్‌, అఫ్రిది కాదు.. పాక్‌లో ఆ భార‌త క్రికెట‌ర్‌కే ఫ్యాన్స్ ఎక్కువ'

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)