యాషెస్ ఐదో టెస్టు.. తొలి రోజు ఇంగ్లండ్‌దే

Published on Sun, 01/04/2026 - 14:11

యాషెస్ సిరీస్ 2025-26లో ఆఖరి టెస్టును ఇంగ్లండ్ ఘనంగా ఆరంభించింది. సిడ్నీ వేదికగా ఆదివారం ప్రారంభమైన ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియాపై ఇంగ్లీష్ జట్టు పైచేయి సాధించింది. అయితే వర్షం కారణంగా మొదటి రోజు కేవలం 45 ఓవర్లు ఆట మాత్రమే సాధ్యపడింది.

తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. క్రీజులో జోరూట్‌(72), హ్యారీ బ్రూక్‌(78) ఉన్నారు. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. 57 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 
ఈ సమయంలో రూట్‌, బ్రూక్ అద్భుతమైన పోరాటం కనబరిచారు. మరో వికెట్ కోల్పోకుండా ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. 

వీరిద్దరూ నాలుగో వికెట్‌కు అజేయంగా 154 పరుగుల భాగస్వా‍మ్యాన్ని నెలకొల్పారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌, మైఖల్‌ నీసర్‌, స్కాట్‌ బోలాండ్‌ తలా వికెట్‌ సాధించారు. కాగా ఇప్పటికే యాషెస్ సిరీస్‌ను 3-1 తేడాతో ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓటమి చ‌విచూసిన ఇంగ్లండ్‌.. మెల్‌బోర్న్ వేదిక‌గా జ‌రిగిన బాక్సింగ్ డే టెస్టులో మాత్రం అద్భుత‌మైన విజ‌యాన్ని అందుకుంది.

తుది జ‌ట్లు
ఆస్ట్రేలియా : ట్రావిస్ హెడ్, జేక్ వెదరాల్డ్, మార్నస్ లబుషేన్‌, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, అలెక్స్ కారీ (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, బ్యూ వెబ్‌స్టర్, మైఖేల్ నేజర్, మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్

ఇంగ్లాండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీప‌ర్‌), విల్ జాక్స్, బ్రైడాన్ కార్స్, మాథ్యూ పాట్స్, జోష్ టంగ్

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)