జట్టు మారనున్న ఆర్సీబీ స్టార్‌ జితేశ్‌ శర్మ

Published on Thu, 07/17/2025 - 11:20

తాజాగా ముగిసిన ఐపీఎల్‌ సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును (ఆర్సీబీ) ఛాంపియన్‌గా నిలపడంతో కీలకపాత్ర పోషించిన జితేశ్‌ శర్మ.. రానున్న దేశవాలీ సీజన్‌ కోసం జట్టు మారనున్నాడు. అరంగేట్రం నుంచి గత సీజన్‌ వరకు విదర్భకు ప్రాతినిథ్యం వహించిన జితేశ్‌.. వచ్చే సీజన్‌ నుంచి బరోడాకు ఆడనున్నాడు. 

గత రంజీ సీజన్‌లో (2024-25) మొత్తం బెంచ్‌కే పరిమితం కావడంతో జితేశ్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు. జట్టు మారే విషయంలో జితేశ్‌ను బరోడా కెప్టెన్‌, ఆర్సీబీ సహచరుడు కృనాల్‌ పాండ్యా ప్రభావితం చేసినట్లు తెలుస్తుంది.

విదర్భ తరఫున పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు మాత్రమే పరిమితమైన జితేశ్‌.. రెడ్‌ బాల్‌ ఫార్మాట్‌లో సత్తా చాటాలని అనుకుంటున్నాడు. ఇందుకు అతనికి సరైన అవకాశాలు కావాలి. అయితే విదర్భలో ఇది జరగడం లేదు. అందుకే అతను బరోడాకు మారాలని నిర్ణయించుకున్నాడు. విదర్భలో జితేశ్‌కు బదులు అక్షయ్‌ వాద్కర్‌కు అవకాశాలు ఎక్కువగా దొరికేవి.

రైట్‌ హ్యాండ్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ అయిన జితేశ్‌.. 2015-16 సీజన్‌లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసినప్పటికీ ఇప్పటివరకు కేవలం​ 18 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇందులోనూ అతని ప్రదర్శన ఏమంత ఆశాజనకంగా లేదు. ఈ మ్యాచ్‌ల్లో జితేశ్‌ 24.48 సగటున కేవలం 661 పరుగులు మాత్రమే చేశాడు.

జితేశ్‌ పరిమిత ఓవర్ల కెరీర్‌ (దేశవాలీ) విషయానికొస్తే.. అతను ఇప్పటివరకు 56 లిస్ట్‌-ఏ మ్యాచ్‌లు, 141 టీ20లు ఆడాడు. ఇందులో 3 సెంచరీలు, 18 హాఫ్‌ సెంచరీల సాయంతో 4419 పరుగులు చేశాడు. 31 ఏళ్ల జితేశ్‌ తాజాగా ముగిసిన ఐపీఎల్‌ సీజన్‌లో అత్యుత్తమంగా రాణించాడు. ఈ సీజన్‌లో అతను 176.35 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించి, ఆర్సీబీ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.

మరో ఆర్సీబీ ఆటగాడు కూడా..!
దేశవాలీ క్రికెట్‌లో మరో ఆర్సీబీ ఆటగాడు కూడా జట్టు మారనున్నాడు. గత ఐపీఎల్‌ సీజన్‌లో బెంచ్‌కే పరిమితమైన స్వప్నిల్‌ సింగ్‌.. రానున్న దేశవాలీ సీజన్‌ కోసం ఉత్తరాఖండ్‌ నుంచి త్రిపురకు మారనున్నాడు. లెఫ్ట్‌ ఆర్మ్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ అయిన స్వప్నిల్‌.. ఉత్తరాఖండ్‌ తరఫున 5 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 18 వికెట్లు తీశాడు.

 

 

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)