Breaking News

IND VS AUS: భారత క్రికెట్ అభిమానులకు శుభవార్త

Published on Thu, 09/14/2023 - 18:20

భారత క్రికెట్‌ అభిమానులకు రిలయెన్స్‌ వారి జియో సినిమా శుభవార్త చెప్పింది. ఈ నెల 22, 24, 27 తేదీల్లో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను జియో సినిమా ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మ్యాచ్‌లను ఇంగ్లిష్, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, భోజ్‌పురి, పంజాబీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో  లైవ్ స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు పేర్కొంది.

ఈ సిరీస్‌ కోసం జియో సినిమా ప్రత్యేక కామెంటేటర్స్‌ ప్యానెల్‌ను కూడా ఏర్పాటు చేసుకుంది. ఇందులో సురేశ్ రైనా, కేదార్ జాదవ్, ఆకాశ్ చోప్రా, అమిత్ మిశ్రా, హనుమ విహారి, కిరణ్ మోరె, అనిరుద్‌ శ్రీకాంత్, శరణ్‌దీప్ సింగ్ తదితర మాజీ భారత క్రికెటర్లు ఉన్నారు.  సిరీస్‌లో భాగంగా తొలి వన్డే సెప్టెంబర్‌ 22న మొహాలీలో, రెండో వన్డే సెప్టెంబర్‌ 24న ఇండోర్‌లో, మూడో వన్డేలో  రాజ్‌కోట్‌లో జరుగనుంది.

భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌లన్నీ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ సిరీస్‌ ముగియగానే భారత్‌లోనే వన్డే ప్రపంచకప్‌ ప్రారంభంకానుంది. అక్టోబర్‌ 5న జరిగే ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభమవుతుంది. 

కాగా, రిలయెన్స్‌ అనుబంధ సంస్థ అయిన వయాకామ్‌18 బీసీసీఐ మీడియా హక్కులను 5963 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ 22 నుంచి స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే 3 మ్యాచ్‌ల వన్డే నుంచే బీసీసీఐతో వయాకామ్‌ ప్రయాణం మొదలుకానుంది. వాయకామ్‌ సంస్థ రానున్న ఐదేళ్లలో (2023 సెప్టెంబర్‌ నుంచి 2028 మార్చి) టీమిండియా స్వదేశంలో ఆడే మ్యాచ్‌ల టీవీ ప్రసార హక్కులతో పాటు డిజిటల్‌ ప్రసార హక్కులను కూడా సొంతం చేసుకుంది. 

భారత క్రికెట్‌ జట్టు స్వదేశంలో ఆడే మ్యాచ్‌లు స్పోర్ట్స్‌ 18 ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుండగా.. ఇవే మ్యాచ్‌లు జియో సినిమాలో లైవ్‌ స్ట్రీమింగ్‌ కానున్నాయి. జియో సినిమా ఇదివరకే ఐపీఎల్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌ హక్కులను (ఐపీఎల్‌ డిజిటల్‌ రైట్స్‌) కూడా దక్కించుకుంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)