Breaking News

ఇంగ్లండ్‌తో యాషెస్‌ సిరీస్‌.. ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పు

Published on Fri, 05/26/2023 - 17:24

ఇంగ్లండ్‌తో యాషెస్‌ సిరీస్‌కు ప్రకటించిన జట్టులో క్రికెట్‌ ఆస్ట్రేలియా ఓ కీలక మార్పు చేసింది. తొలి టెస్టు తర్వాత స్వదేశానికి తిరిగివెళ్లనున్న జోష్ ఇంగ్లిస్ స్థానంలో ఆన్‌క్యాప్డ్‌ ఆటగాడు జిమ్మీ పీర్సన్‌ను క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది.  తన భార్య మొదటి బిడ్డకు జన్మనివ్వనుండడంతో తొలి టెస్టు ముగిసిన వెంటనే ఇంగ్లిస్‌ స్వదేశానికి పయనం కానున్నాడు.

ఈ క్రమంలో లార్డ్స్‌ వేదికగా జరగనున్న రెండో టెస్టుకు ముందు జిమ్మీ పీర్సన్‌ ఆస్ట్రేలియా క్యాంప్‌లో కలవనున్నాడు. కాగా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో క్వీన్స్‌లాండ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పీర్సన్‌కు మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. 65 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన ఈ క్వీన్స్‌లాండ్‌ ఆటగాడు 34.75 సగటుతో 3000 పరుగులు చేశాడు.

అందులో 6 సెంచరీలు ఉన్నాయి. అయితే లోయార్డర్‌లో బ్యాటింగ్‌ వచ్చి 6 సెంచరీలు సాధించడం విశేషం. ఇక జూన్ 7 నుంచి 11 వరకు ఓవల్‌లో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియాతో​తలపడనుంది. అనంతరం జూన్ 16న ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా యాషెస్ సిరీస్ ప్రారంభం కానుంది.

డబ్ల్యూటీసీ ఫైనల్‌, యాషెస్‌ సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్‌), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, నాథన్ లియాన్, మిచెల్ మార్ష్, టోడిఫై మార్ష్, , మాథ్యూ రెన్షా, స్టీవ్ స్మిత్ (వైస్‌ కెప్టెన్‌), మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్
చదవండి: IPL 2023: అతడిపై చాలా ఆశలు పెట్టుకున్నా.. ఒక్క శాతం కూడా చేరుకోలేకపోయాడు: సెహ్వాగ్

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి