Breaking News

జెస్సికా జోరు

Published on Fri, 09/06/2024 - 04:11

న్యూయార్క్‌: ఎట్టకేలకు గ్రాండ్‌స్లామ్‌ క్వార్టర్‌ ఫైనల్‌ ‘ఫోబియా’ను అమెరికా టెన్నిస్‌ ప్లేయర్‌ జెస్సికా పెగూలా అధిగమించింది. సొంతగడ్డపై అద్భుత ఆటతీరుతో అదరగొట్టిన జెస్సికా ఏకంగా ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ ఇగా స్వియాటెక్‌ను బోల్తా కొట్టించింది. ఈ క్రమంలో తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. 

సీజన్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌లో ఈసారి అమెరికా క్రీడాకారులు తమ ఉనికిని చాటుకుంటున్నారు. పురుషుల సింగిల్స్‌లో ఇద్దరు అమెరికా ఆటగాళ్లు టేలర్‌ ఫ్రిట్జ్, ఫ్రాన్సెస్‌ టియాఫో సెమీఫైనల్లోకి అడుగు పెట్టగా... మహిళల సింగిల్స్‌లోనూ ఇద్దరు అమెరికా క్రీడాకారిణులు జెస్సికా పెగూలా, ఎమ్మా నవారో సెమీఫైనల్‌కు చేరుకోవడం విశేషం.

సినెర్, డ్రేపర్‌ తొలిసారి... 
పురుషుల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ యానిక్‌ సినెర్‌ (ఇటలీ), 25వ ర్యాంకర్‌ జాక్‌ డ్రేపర్‌ (బ్రిటన్‌) తొలిసారి యూఎస్‌ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి అడుగు పెట్టారు. క్వార్టర్‌ ఫైనల్స్‌లో సినెర్‌ 6–2, 1–6, 6–1, 6–4తో 2021 చాంపియన్, గత ఏడాది రన్నరప్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ (రష్యా)పై గెలుపొందగా... డ్రేపర్‌ 6–3, 7–5, 6–2తో పదో సీడ్‌ అలెక్స్‌ డిమినార్‌ (ఆ్రస్టేలియా)ను ఓడించాడు. 

కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీఫైనల్‌ చేరిన డ్రేపర్‌ యూఎస్‌ ఓపెన్‌లో సెమీఫైనల్‌ చేరుకున్న నాలుగో బ్రిటన్‌ ప్లేయర్‌గా నిలిచాడు. గతంలో గ్రెగ్‌ రుసెద్‌స్కీ (1997), టిమ్‌ హెన్మన్‌ (2004), ఆండీ ముర్రే (2008, 2011, 2012) ఈ ఘనత సాధించారు.  

ఏడో ప్రయత్నంలో...
కెరీర్‌లో 23వసారి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఆడుతున్న 30 ఏళ్ల జెస్సికా గతంలో ఆరుసార్లు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలలో క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే ఈ ఆరుసార్లూ ఆమె క్వార్టర్‌ ఫైనల్‌ అడ్డంకిని అధిగమించడంలో విఫలమైంది. కానీ ఏడో ప్రయత్నంలో జెస్సికా సఫలమైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ నాలుగో క్వార్టర్‌ ఫైనల్లో జెస్సికా 6–2, 6–4తో టాప్‌ సీడ్‌ స్వియాటెక్‌ (పోలాండ్‌)ను కంగుతినిపించింది. 

88 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో జెస్సికా ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేసింది. 12 విన్నర్స్‌ కొట్టిన జెస్సికా 22 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు స్వియాటెక్‌ 41 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. ‘గతంలో పలుమార్లు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకొని ఓడిపోయాను. సెమీఫైనల్‌ ఎప్పుడు చేరుకుంటావు అని నా శ్రేయోభిలాషులు అడుగుతుండేవారు. వారికి ఏం సమాధానం చెప్పాలో తెలిసేది కాదు. 

ఎట్టకేలకు క్వార్టర్‌ ఫైనల్‌ను దాటి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకున్నందుకు సంతోషంగా ఉంది’ అని జెస్సికా వ్యాఖ్యానించింది. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో కరోలినా ముకోవా (చెక్‌ రిపబ్లిక్‌)తో జెస్సికా; ఎమ్మా నవారో (అమెరికా)తో సబలెంకా (బెలారస్‌) తలపడతారు.  

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)