Breaking News

సెమీస్‌లో జెస్సికా

Published on Wed, 09/03/2025 - 02:33

న్యూయార్క్‌: సొంతగడ్డపై తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా టెన్నిస్‌ స్టార్‌ జెస్సికా పెగూలా ఆ దిశగా మరో అడుగు వేసింది. యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ జెస్సికా పెగూలా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. 

మంగళవారం జరిగిన తొలి క్వార్టర్‌ ఫైనల్లో నాలుగో సీడ్‌ జెస్సికా 6–3, 6–3తో ప్రపంచ 62వ ర్యాంకర్, 2021 ఫ్రెంచ్‌ ఓపెన్, 2024 వింబుల్డన్‌ టోర్నీ విజేత బార్బరా క్రెజికోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై గెలుపొందింది. 86 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో గత ఏడాది రన్నరప్‌ జెస్సికా ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేసింది. నెట్‌ వద్దకు 12 సార్లు దూసుకొచ్చి పదిసార్లు పాయింట్లు గెలిచింది. మరోవైపు క్రెజికోవా ఏకంగా ఏడు డబుల్‌ ఫాల్ట్‌లు, 24 అనవసర తప్పిదాలు చేసింది.  

కోకో గాఫ్‌ అవుట్‌ 
మరోవైపు ప్రపంచ మూడో ర్యాంకర్, టైటిల్‌ ఫేవరెట్స్‌లో ఒకరైన కోకో గాఫ్‌ (అమెరికా) ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే వెనుదిరిగింది. ప్రపంచ మాజీ నంబర్‌వన్, నాలుగు గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన నయోమి ఒసాకా (జపాన్‌) 6–3, 6–2తో 2023 చాంపియన్‌ కోకో గాఫ్‌ను ఓడించింది. తద్వారా 2021 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ తర్వాత ఒసాకా మరోసారి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకుంది. 

ఇతర ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో రెండో సీడ్‌ ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌) 6–3, 6–1తో ఎకతెరీనా అలెగ్జాండ్రోవా (రష్యా)పై, కరోలినా ముకోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6–3, 6–7 (0/7), 6–2తో మార్టా కోస్టుక్‌ (ఉక్రెయిన్‌)పై, ఎనిమిదో సీడ్‌ అమండ అనిసిమోవా (అమెరికా) 6–0, 6–3తో బీట్రిజ్‌ హదద్‌ మాయ (బ్రెజిల్‌)పై నెగ్గి క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. 

సూపర్‌ సినెర్‌... 
పురుషుల సింగిల్స్‌ విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్‌ యానిక్‌ సినెర్‌ (ఇటలీ) క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. అలెగ్జాండర్‌ బుబ్లిక్‌ (కజకిస్తాన్‌)తో జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సినెర్‌ కేవలం మూడు గేమ్‌లు కోల్పోయాడు. 81 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్‌లో సినెర్‌ 6–1, 6–1, 6–1తో బుబ్లిక్‌ను ఓడించాడు. ఇతర ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో ఫెలిక్స్‌  అలియాసిమ్‌ (కెనడా) 7–5, 6–3, 6–4తో 15వ సీడ్‌ రుబ్లెవ్‌ (రష్యా)పై, పదో సీడ్‌ లొరెంజో ముసెట్టి (ఇటలీ) 6–3, 6–0, 6–1తో మునార్‌ (స్పెయిన్‌)పై గెలిచి క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు.    

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)