Breaking News

డబ్ల్యూబీబీఎల్‌కు జెమీమా దూరం

Published on Fri, 11/28/2025 - 08:09

బ్రిస్బేన్‌: భారత క్రికెటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌... మహిళల బిగ్‌ బాష్‌ లీగ్‌ (డబ్ల్యూబీబీఎల్‌)లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమైంది. టీమిండియా వైస్‌ కెపె్టన్‌ స్మృతి మంధాన వివాహం వాయిదా పడిన నేపథ్యంలో... సహచరిణికి అండగా ఉండాలని జెమీమా నిర్ణయించుకుంది. దీంతో డబ్ల్యూబీబీఎల్‌ రెండో దశ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనని నిర్వాహకులకు తెలిపింది. జెమీమా అభ్యర్థనను ఫ్రాంచైజీ అర్థం చేసుకొని తమ ప్లేయర్‌కు వెసులుబాటు కలి్పంచింది. 

వన్డే ప్రపంచకప్‌ టైటిల్‌ గెలిచిన అనంతరం జెమీమీ డబ్ల్యూబీబీఎల్‌లో పాల్గొనేందుకు ఆ్రస్టేలియా వెళ్లింది. కొన్ని రోజుల ప్రాక్టీస్‌ అనంతరం భారత ఓపెనర్‌ స్మృతి మంధాన వివాహం కోసం స్వదేశానికి తిరిగి వచ్చింది. అయితే వివాహం జరగాల్సిన రోజు స్మృతి తండ్రి అనారోగ్యానికి గురవడంతో పెళ్లి వాయిదా పడింది. ఇలాంటి క్లిష్ట సమయంలో తిరిగి ఆ్రస్టేలియా వెళ్లకూండా స్మృతికి తోడుగా ఉండాలని జెమీమా నిర్ణయించుకుంది. డబ్ల్యూబీబీఎల్‌లో జెమీమా బ్రిస్బేన్‌ హీట్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ‘జెమీమా అభ్యర్థనను ఫ్రాంచైజీ అర్థం చేసుకుంది. 

మహిళల బిగ్‌ బాష్‌ లీగ్‌ తదుపరి మ్యాచ్‌ల నుంచి ఆమెను విడుదల చేసింది’ అని బ్రిస్బేన్‌ హీట్‌ జట్టు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో డబ్ల్యూబీబీఎల్‌లో మిగిలిన నాలుగు మ్యాచ్‌లకు జెమీమా దూరం అయింది. భారత జట్టు తొలిసారి మహిళల వన్డే వరల్డ్‌కప్‌ గెలవడంలో జెమీమా కీలక పాత్ర పోషించింది. సెమీఫైనల్లో ఏడుసార్లు ప్రపంచ చాంపియన్‌ ఆ్రస్టేలియాపై అజేయ శతకంతో జట్టును గెలిపించి ఫైనల్‌కు చేర్చింది.    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)