Breaking News

చరిత్ర సృష్టించిన ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్‌..

Published on Mon, 12/01/2025 - 19:30

టీమిండియా వెట‌ర‌న్ పేస‌ర్‌, సౌరాష్ట్ర దిగ్గ‌జం జ‌య‌దేవ్ ఉన‌ద్క‌ట్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. దేశ‌వాళీ టీ20 టోర్నీ స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో లీడింగ్ వికెట్ టేక‌ర్‌గా ఉన‌ద్క‌ట్ అవ‌త‌రించాడు.  ఆదివారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఢిల్లీతో జ‌రిగిన మ్యాచ్‌లో కెప్టెన్ నితీశ్ కుమార్‌ను ఔట్ చేసిన జయదేవ్‌.. ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఇప్పటివరకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 83 మ్యాచ్‌లు ఆడి 121 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు సిద్ధార్థ్ కౌల్(120) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కౌల్‌ను ఉనద్కట్ అధిగమించాడు.

పోరాడి ఓడిన సౌరాష్ట్ర
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సౌరాష్ట్రపై 10 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో సౌరాష్ట్ర 6 వికెట్లు కోల్పోయి 197 పరుగులకే పరిమితమైంది. రుచిత్ అహిర్(39), వగేలా(7 బంతుల్లో 23) ఆఖరిలో మెరుపులు మెరిపించినప్పటికి ఓటమి నుంచి మాత్రం తప్పించలేకపోయారు.  ఢిల్లీ స్పిన్నర్‌ సుయష్ శర్మ 3 వికెట్లతో సత్తాచాటాడు.

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే..
జయదేవ్ ఉనద్కత్ 121
సిద్ధార్థ్ కౌల్ 120
పీయూష్ చావ్లా 113
లుక్మాన్ మేరివాలా 108
చామ మిలింద్ 107

ప్రస్తుతం టాప్‌-5 బౌలర్లలో జయదేవ్‌, చామ మిలింద్ మాత్రమే ఇంకా ఆడుతున్నారు. ఐపీఎల్‌-2026 మినీ వేలానికి ముందు ఉనద్కట్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ రిటైన్‌ చేసుకుంది.
చదవండి: IND vs SA: ఒక్క మ్యాచ్‌కే అత‌డిపై వేటు.. డేంజ‌ర‌స్ బ్యాట‌ర్‌కు ఛాన్స్‌?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)