Breaking News

ఔట్ చేసిన ఆనందంలో ఓవరాక్షన్‌.. క‌ట్ చేస్తే! భారీ షాకిచ్చిన ఐసీసీ

Published on Fri, 06/27/2025 - 09:27

వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జేడెన్ సీల్స్‌కు అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌(ఐసీసీ) భారీ షాకిచ్చింది. బార్బోడ‌స్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న తొలి టెస్టులో త‌న చ‌ర్య‌ల‌కు గాను ఐసీసీ జరిమానా విధించింది.  మొద‌టి రోజు ఆట‌లో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్‌ను ఔట్ చేసిన ఆనందంలో సీల్స్ దురుస ప్ర‌వ‌ర్త‌న క‌న‌బ‌రిచాడు.

తొలి ఇన్నింగ్స్‌లో వ‌రుస క్ర‌మంలో వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను ప్యాట్ క‌మ్మిన్స్ ఆదుకునే ప్ర‌య‌త్నం చేశాడు.  కమ్మిన్స్ 18 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 28 పరుగులు చేశాడు. ఈ క్ర‌మంలో క‌మ్మిన్స్‌ను సీల్స్ అద్బుత‌మైన బంతితో బోల్తా కొట్టించాడు. దీంతో సీల్స్ సెల‌బ్రేష‌న్స్ శ్రుతిమించాయి.

ఈ విండీస్ స్పీడ్ స్టార్ క‌మ్మిన్స్ వైపు వేలు చూపిస్తూ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపో అంటూ సీరియ‌స్ అయ్యాడు. ఈ నేప‌థ్యంలో ఫీల్డ్ అంపైర్‌ల ఫిర్యాదు మేర‌కు సీల్స్‌పై ఐసీసీ మ్యాచ్ రిఫ‌రీ చ‌ర్య‌లు దిగారు. ఆర్టికల్ 2.5 ను ఉల్లంఘించినందుకు అత‌డి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోతతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ విధించారు. సీల్స్ సైతం త‌న త‌ప్పిదాన్ని అంగీక‌రించాడు.

"నా బౌలింగ్‌లో క‌మ్మిన్స్ రెండు భారీ షాట్లు కొట్టినందుకు, అతనికి డ్రెస్సింగ్ రూమ్ ఎక్కడ ఉందో చూపించాను. అంతే త‌ప్ప అందులో ఇంకేమి లేదు" అని సీల్స్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో జైడ‌న్ సీల్స్ నిప్పులు చెరుగుతున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు రెండు ఇన్నింగ్స్‌లలో క‌లిపి 6 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

ర‌స‌వ‌త్త‌రంగా బార్బోడ‌స్  టెస్టు
ఇక బార్బోడ‌స్ టెస్టు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ఇరు జ‌ట్ల‌కు విజ‌య‌వ‌కాశాలు స‌మంగా ఉన్నాయి.  రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా త‌మ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది.క్రీజులో ట్రావిస్ హెడ్‌(13), వెబ్‌స్టెర్‌(19) ఉన్నారు. ఆస్ట్రేలియా ప్రస్తుతం 82 పరుగుల ఆధి​క్యంలో కొనసాగుతోంది.  అంత‌కుముందు వెస్టిండీస్  తమ తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగులకే కుప్పకూలింది.
చదవండి: WI vs AUS: ఆసీస్‌కు చుక్కలు చూపిస్తున్న విండీస్‌.. ఓటమి తప్పదా?

Videos

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు