Breaking News

దుమ్ములేపిన మహ్మద్ షమీ.. అయినా ఘోర ప‌రాభవం

Published on Sat, 12/06/2025 - 17:23

టీమిండియా స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ త‌న అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో జాతీయ సెల‌క్ట‌ర్ల‌కు మ‌రోసారి సవాల్ విసిరాడు. స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో దుమ్ములేపుతున్నాడు. ఈ దేశవాళీ టీ20 టోర్నీలో భాగంగా శ‌నివారం పుదుచ్చేరి (Puducherry)తో జ‌రిగిన మ్యాచ్‌లో ష‌మీ నిప్పులు చెరిగాడు. 

ష‌మీ త‌న నాలుగు ఓవ‌ర్ల కోటాలో 32 ప‌రుగులిచ్చి మూడు వికెట్ల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. అయితే ష‌మీ స‌త్తాచాటిన‌ప్ప‌టికి బ్యాట‌ర్లు విఫ‌లం కావ‌డంతో బెంగాల్ 81 ప‌రుగుల తేడాతో ఘోర ఓట‌మి చూడాల్సి వ‌చ్చింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పుదుచ్చేరి నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 177 ప‌రుగులు చేసింది.

పుదుచ్చేరి బ్యాట‌ర్ల‌లో ఆమ‌న్ ఖాన్‌(74) హాఫ్‌ సెంచరీ సాధించగా.. జస్వంత్‌(45) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. బెంగాల్‌ బౌలర్లలో షమీతో పాటు చటర్జీ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య చేధనలో బెంగాల్‌ బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు.

పుదుచ్చేరి బౌలర్ల దాటికి బెంగాల్‌ 13.5 ఓవర్లలో కేవలం 96 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్‌గా కరణ్‌ లాల్‌(40) మినహా మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. పుదుచ్చేరి బౌలర్లలో జయంత్‌ యాదవ్‌ 4 వికెట్లతో సత్తాచాటగా.. సైదక్‌ సింగ్‌ మూడు, అయూబ్‌, అమన్‌ ఖాన్‌ తలా వికెట్‌ సాధించారు. ఈ సీజన్‌లో బెంగాల్‌కు ఇది రెండో ఓటమి.
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)