Breaking News

పాకిస్తాన్‌కు టీమిండియా రావాలి.. ఆ బాధ్య‌త అత‌డిదే: యూనిస్‌ ఖాన్‌

Published on Thu, 08/29/2024 - 18:00

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ఆతిథ్యమిచ్చేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అన్ని విధాల సన్నద్దమవుతోంది. ఇప్పటికే తమ స్టేడియాల‌ పునర్నిర్మాణ ప‌నుల‌ను కూడా పీసీబీ ప్రారంభించింది.   కాగా 28 ఏళ్ల త‌ర్వాత తొలి ఐసీసీ ఈవెంట్‌కు పాకిస్తాన్‌కు ఆతిథ్యమివ్వనుంది.

పాక్‌లో చివరగా 1996లో ఐసీసీ టోర్నీ(వన్డే వరల్డ్‌కప్‌) జరిగింది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీని  పీసీబీ ప్ర‌తిష్ట‌త్మకంగా తీసుకుంది. ఇక ఇది ఇలా ఉండగా..  ఈ ఈవెంట్‌లో పాల్గోనేందుకు టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్తుందా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. 

భారత్ ఆడే మ్యాచ్‌లను తాత్కాలిక వేదికగా నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తుంటే.. పీసీబీ మాత్రం భారత జట్టు కచ్చితంగా తమ దేశానికి రావల్సిందే అని మొండి పట్టుతో ఉంది. కాగా ఐసీసీ మాత్రం ఈ విషయంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే భార‌త జ‌ట్టు పాక్‌కు వెళ్తుందా లేదా అన్న‌ది తేల్చాల్సిన బాధ్య‌త‌ కొత్తగా ఎన్నికైన ఐసిసి ఛైర్మన్ జై షాపై పడింది.

ఆ బాధ్యత అతడిదే..
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టును పాకిస్తాన్‌కు పంపే బాధ్యతను జైషా తీసుకోవాలని యూనిస్ సూచించాడు. 

"ఐసీసీ చీఫ్‌గా జై షా నియామ‌కంతో క్రికెట్‌కు మరింత ఆదరణ పెరుగుతుందని నేను ఆశిస్తున్నాను. అదే విధంగా భారత జట్టు పాకిస్తాన్‌కు వచ్చేవిధంగా జై షా చొరవ తీసుకోవాలి. అతడు క్రీడా స్ఫూర్తిని చూపించాల్సిన అవసరం ఉంది. అప్పుడు పాక్ జట్టు కూడా ఆడేందుకు భారత్‌కు వస్తుంది" అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో యూనిస్ ఖాన్ పేర్కొన్నాడు. 

కాగా ఈ టోర్నీకి సంబంధించి డ్రాప్ట్ షెడ్యూల్‌ను కూడా ఐసీసీకి పాక్ క్రికెట్ బోర్డు పంపించింది. డ్రాప్ట్ షెడ్యూల్ ప్రకారం..ఫిబ్ర‌వ‌రి 19, 2025న పాకిస్తాన్‌- న్యూజిలాండ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ  ప్రారంభం కానుంది.
చదవండి: మళ్లీ స్కూల్‌కు వెళ్తా.. విండీస్‌ టూర్‌లో కూడా చదువుకున్నా: సఫారీ బౌలర్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)