Breaking News

ఐసీసీ చైర్మన్‌గా రెండు విడతల్లో కొనసాగనున్న జై షా..!

Published on Tue, 10/22/2024 - 16:29

డిసెంబర్‌ 1 నుంచి ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న జై షా రెండు విడతల్లో (చెరి మూడేళ్లు) ఆరేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నాడని తెలుస్తుంది. దుబాయ్‌ వేదికగా ఇటీవల జరిగిన ఐసీసీ బోర్డు సభ్యుల సమావేశంలో ఈ విషయాన్ని ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్‌ పదవి మూడు విడతల్లో ఆరేళ్ల పాటు ఉంది. ఈ మోడల్‌లో స్వల్ప మార్పులు చేసినట్లు తెలుస్తుంది.

కాగా, జై షా ఇటీవలే ఐసీసీ చైర్మన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. గ్రెగ్‌ బార్‌క్లే స్థానంలో జై షా ఐసీసీ చైర్మన్‌గా ఎంపికయ్యాడు. బార్‌క్లే 2020 నుంచి రెండు విడతల్లో ఐసీసీ చైర్మన్‌గా పని చేశాడు. వాస్తవానికి బార్‌క్లే పదవీకాలం మరో రెండేళ్ల పాటు ఉండింది. అయితే బార్‌క్లే వ్యక్తిగత కారణాల చేత చైర్మన్‌ పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. దీంతో నూతన చైర్మన్‌గా షా ఎంపికయ్యాడు.

మరోవైపు ఐసీసీ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ పదవి కూడా ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఈ పదవిలో పెప్సీకో చైర్‌ పర్సన్‌ ఇంద్రా నూయి మూడు విడతల్లో కొనసాగింది. ఇంద్ర నూయి ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ పదవి నుంచి వైదొలిగినప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది.

జై షా తర్వాత ఎవరు..?
ఐసీసీ చైర్మన్‌గా జై షా నియామకం ఖరారైపోయిన విషయం తెలిసిందే. దీంతో బీసీసీఐ కార్యదర్శి పదవి ఎవరు చేపడతారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొత్త కార్యదర్శి రేసులో ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రోహన్‌ జైట్లీ ముందున్నట్లు తెలుస్తుంది. రోహన్‌తో పాటు బీసీసీఐ ట్రెజరర్‌ ఆశిష్‌ షెలార్‌, జాయింట్‌ సెక్రెటరీ దేవజిత్‌ సైకియా, గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సెక్రెటరీ అనిల్‌ పటేల్‌ కూడా పోటీలో ఉన్నట్లు సమాచారం.

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)