Breaking News

మొహమ్మద్‌ షమీకి సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌

Published on Mon, 03/11/2024 - 18:06

టీమిండియా స్టార్‌ పేసర్‌ మొహమ్మద్‌ షమీకి సంబంధించి బీసీసీఐ కార్యదర్శి జై షా బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. షమీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో (స్వదేశంలో) జరిగే టెస్ట్‌ సిరీస్‌ సమయానికి అందుబాటులోకి వస్తాడని షా తెలిపారు. 

షా స్టేట్‌మెంట్‌ను బట్టి చూస్తే షమీ టీ20 వరల్డ్‌కప్‌తో పాటు ఐపీఎల్‌ ఆడడని ఖరారైపోయింది. లండన్‌లో చీలిమండ గాయానికి శస్త్రచికిత్స చేసుకుని ఇటీవలే స్వదేశానికి వచ్చిన షమీ.. గతేడాది భారత్‌లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. 

జై షా షమీ హెల్త్‌ అప్‌డేట్‌ ఇస్తున్న సందర్భంగానే మరో టీమిండియా ఆటగాడు కేఎల్‌ రాహుల్‌కు సంబంధించిన అప్‌డేట్‌ కూడా ఇచ్చారు. వెన్ను సమస్యతో బాధపడుతున్న రాహుల్‌.. ఐపీఎల్‌ ఆరంభ సమయానికి పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తాడని షా తెలిపారు.

ఎన్‌సీఏ వైద్యుల పర్యవేక్షణలో ఉన్న రాహుల్‌కు ఇంజెక్షన్‌ అవసరముందని షా పేర్కొన్నారు. వెన్ను సమస్య కారణంగా రాహుల్‌ ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లోని చివరి నాలుగు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. 

కాగా, జై షా వీరిద్దరి గురించే కాకుండా మరో టీమిండియా ఆటగాడి హెల్త్‌ గురించి కూడా అప్‌డేట్‌ ఇచ్చడు. 2022లో కారు ప్రమాదానికి గురై ప్రస్తుతం ఎన్‌సీఏ రీహ్యాబ్‌లో ఉన్న రిషబ్‌ పంత్‌ పూర్తిగా కోలుకున్నాడని షా తెలిపారు. పంత్‌ మునపటిలా బ్యాటింగ్‌ చేస్తున్నాడని పేర్కొన్నారు. త్వరలోనే పంత్‌కు ఎన్‌ఓసీ ఇస్తామని షా వెల్లడించారు. 
 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)