Breaking News

ఐసీసీ చైర్మన్‌గా జై షా ఏకగ్రీవ ఎన్నిక.. ప్రకటన విడుదల

Published on Tue, 08/27/2024 - 20:43

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) చైర్మన్‌గా జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందుకు సంబంధించి ఐసీసీ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది డిసెంబరు 1న ఆయన బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపింది. కాగా ప్రస్తుతం ఐసీసీ చైర్మన్‌గా ఉన్న గ్రెగ్‌ బార్‌క్లే తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు ఆగష్టు 20న ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇప్పటికే రెండు దఫాలుగా చైర్మన్‌గా వ్యవహరించిన గ్రెగ్‌ బార్‌క్లే.. మూడోసారి పగ్గాలు చేపట్టేందుకు విముఖంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయన స్థానాన్ని జై షా భర్తీ చేశారు. ఐసీసీలోని మొత్తం పదహారు మంది సభ్యుల్లో 15 మంది జై షాకు అనుకూలంగా ఉండటంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.

సరికొత్త రికార్డు
ఇక నవంబరు 30న బార్‌క్లే పదవీకాలం ముగియనుండగా... ఆ మరుసటి రోజు జై షా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో 35 ఏళ్ల జై షా సరికొత్త రికార్డు సాధించారు. అత్యంత పిన్న వయసులో ఐసీసీ బాస్‌గా నియమితులైన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.

కాగా జై షా ప్రస్తుతం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి కార్యదర్శిగా సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజా పరిణామం నేపథ్యంలో ఆయన త్వరలోనే బీసీసీఐ పదవి నుంచి వైదొలగనున్నారు. ఇక ఐసీసీ చైర్మన్‌గా ఎన్నిక కావడం తనకు దక్కిన గొ ప్ప గౌరవం అని జై షా హర్షం వ్య క్తం చేశారు.

జై షాకు హెచ్‌సీఏ శుభాకాంక్ష‌లు
ఐసీసీ చైర్మ‌న్‌గా ఏక‌గ్రీవంగా ఎన్నికైన జై షాకు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ తరఫున అధ్య‌క్షుడు జ‌గ‌న్‌మోహన్ రావు శుభాకాంక్ష‌లు
తెలిపారు. జైషా నాయ‌క‌త్వంలో ప్ర‌పంచ క్రికెట్ మ‌రింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

చదవండి: లక్నో కెప్టెన్సీకి రాహుల్‌ గుడ్‌బై!.. రేసులో ఆ ఇద్దరు!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)