Breaking News

రోహిత్‌, కోహ్లి ఫ్యాన్స్‌కు శుభవార్త

Published on Mon, 07/01/2024 - 10:33

టీ20 వరల్డ్‌కప్‌ 2024 అనంతరం టీమిండియా స్టార్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం కోసం పొట్టి ఫార్మాట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ఈ ముగ్గురు ప్రకటించారు. పొట్టి క్రికెట్‌ నుంచి తప్పుకున్న అనంతరం ఈ ముగ్గురు వన్డే ఫార్మాట్‌కు కూడా గుడ్‌బై చెబుతారని ప్రచారం జరుగుతుంది. 

ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందించాడు. రోహిత్‌, కోహ్లి, జడేజా వచ్చే ఏడాది ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆడతారని అన్నాడు. టీ20 వరల్డ్‌కప్‌ 2024 ఆడిన జట్టు 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆడుతుందని హింట్‌ ఇచ్చాడు. సీనియర్లంతా ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొంటారని పేర్కొన్నాడు. 

టీమిండియా మున్ముందు మరిన్ని టైటిళ్లు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. తమ తదుపరి టార్గెట్‌ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీ టైటల్స్‌ అని తెలిపాడు. విరాట్‌, రోహిత్‌లు వన్డేల్లో కొనసాగడంపై షా క్లూ ఇవ్వడంతో వారి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆరాధ్య ఆటగాళ్ల మెరుపులను మరిన్ని రోజులు చూడవచ్చని ఆనందపడుతున్నారు.

ఇదిలా ఉంటే, బీసీసీఐ నిన్న టీమిండియాకు రూ. 125 కోట్ల నగదు నజరానా ప్రకటించింది. ప్రపంచకప్‌ ఆధ్యాంతం అద్భుత ప్రదర్శన కనబర్చి, 17 ఏళ్ల తర్వాత పొట్టి ప్రపంచకప్‌కు తిరిగి సాధించినందుకు భారత బృందం జాక్‌పాట్‌ కొట్టింది. టీమిండియా ప్రస్తుతం ఫైనల్‌ మ్యాచ్‌కు వేదిక​ అయిన బార్బడోస్‌లోనే ఉంది. గాలివాన భీబత్సం (హరికేన్‌) కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో భారత జట్టు బార్బడోస్‌లోనే నిలిచిపోవాల్సి వచ్చింది.

అయితే, హరికేన్‌ ప్రభావం తగ్గి విమాన సర్వీసులు పునరుద్ధరించబడితే రేపటి కల్లా టీమిండియా ఢిల్లీలో ల్యాండ్‌ అవుతుంది. టీమిండియా రాక కోసం స్వదేశంలో అభిమానులు కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. భారత ఆటగాళ్లు ఢిల్లీలో ల్యాండ్‌ కాగానే ఘన స్వాగతం పలకాలని ప్లాన్లు చేసుకున్నారు. భారత ప్రభుత్వం సైతం వరల్డ్‌కప్‌ హీరోలను ఘనంగా సన్మానించాలని ప్రణాళికలు సిద్దం చేసుకుంది. భారత్‌లోకి ఎంటర్‌ కాగానే టీమిండియా హీరోలను ఊరేగింపుగా తీసుకుపోవచ్చు. ఈ తంతు అనంతరం భారత క్రికెట్‌ బృందం ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)