Breaking News

బుమ్రాకు విశ్రాంతి!

Published on Tue, 02/20/2024 - 00:47

రాజ్‌కోట్‌: భారత ప్రధాన పేపర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు నాలుగో టెస్టులో విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలిసింది. ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో సీనియర్‌ సీమర్‌ బుమ్రా రెండో టెస్టును ఒంటిచేత్తో గెలిపించాడు. మూడు మ్యాచ్‌లు ముగిసిన ఈ సిరీస్‌లో అతను 17 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ మూడు మ్యాచ్‌ల్లో 80.5 ఓవర్లు వేశాడు. ఈ నేపథ్యంలో అతనికి రెస్ట్‌ ఇవ్వాలని బోర్డు భావిస్తోంది. బోర్డుకు ఇది కొత్తేం కాదు. ఆటగాళ్లపై పనిఒత్తిడి తగ్గేంచేందుకు బోర్డు కొంతకాలంగా ఇలాంటి వైఖరి అవలంభిస్తోంది.

వైజాగ్‌లో జరిగిన రెండో టెస్టులో హైదరాబాద్‌ స్పీడ్‌స్టర్‌ సిరాజ్‌కు విశ్రాంతినిచ్చి తిరిగి మూడో టెస్టు ఆడించింది. ‘టీమిండియా మంగళవారం రాంచీకి బయలుదేరుతుంది. ఈ మ్యాచ్‌ నుంచి బుమ్రా విశ్రాంతి తీసుకుంటాడు. తొడ కండరాల గాయం నుంచి కోలుకుని వందశాతం ఫిట్‌నెస్‌తో ఉన్న కేఎల్‌ రాహుల్‌ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడు’ అని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారి ఒకరు చెప్పారు.

ధర్మశాలలో మార్చి 7 నుంచి జరిగే ఆఖరి టెస్టులో బుమ్రా తాజాగా బరిలోకి దిగేందుకు ఈ నిర్ణయం దోహదం చేస్తుందని బోర్డు భావిస్తోంది. స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ తొలి టెస్టులో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. కానీ ప్రత్యర్థి స్పిన్‌ ఉచ్చుతో భారత్‌ ఓడిపోయింది. పాతగాయం తిరగబెట్టడంతో రెండో టెస్టు నుంచి తప్పించారు. మూడో మ్యాచ్‌కు ఎంపిక చేసినప్పటికీ ఫిట్‌నెస్‌ సంతరించుకోకపోవడంతో మళ్లీ జాతీయ క్రికెట్‌ అకాడమీకి పంపించారు. భారత్, ఇంగ్లండ్‌ల మధ్య నాలుగో టెస్టు ఈనెల 23 నుంచి రాంచీలో జరుగుతుంది.

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)