Breaking News

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ వ‌స్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్‌

Published on Sat, 05/04/2024 - 20:15

ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియ‌న్స్ వ‌రుస ఓటుముల‌తో స‌త‌మ‌త‌మ‌వుతోంది. శుక్ర‌వారం వాంఖ‌డే వేదిక‌గా కోల్‌క‌తా  నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 24 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైన ముంబై..  త‌మ ప్లే ఆఫ్ అవ‌కాశాల‌ను మ‌రింత సంక్లిష్టం చేసుకుంది.

ఇప్ప‌టివ‌ర‌కు 11 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియ‌న్స్ కేవ‌లం మూడింట మాత్ర‌మే విజ‌యం సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో తొమ్మిదో స్ధానంలో కొన‌సాగుతోంది. ఇక ఈ ఏడాది సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ నిరాశ‌ప‌రుస్తున్న‌ప్ప‌టికి.. ఆ జ‌ట్టు స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా మాత్రం త‌న వంతు న్యాయం చేస్తున్నాడు.

కేకేఆర్‌తో మ్యాచ్‌లోనూ బుమ్రా నాలుగు వికెట్ల‌తో స‌త్తా చాటాడు. ఓవ‌రాల్‌గా ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 17 వికెట్లు ప‌డ‌గొట్టిన బుమ్రా.. లీడింగ్ వికెట్ టేక‌ర్‌గా కొనసాగుతున్నాడు. వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024కు ముందు బుమ్రా సూప‌ర్ ఫామ్‌లో ఉండటం భార‌త జ‌ట్టు క‌లిసిచ్చే ఆంశం.

ఈ క్ర‌మంలో టీమిండియా మాజీ ఓపెన‌ర్ వసీం జాఫ‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ముంబై ఇండియ‌న్స్ ప్లే ఆఫ్స్‌కు చేరే అవ‌కాశాలు దాదాపు లేక‌పోవ‌డంతో మిగిలిన మ్యాచ్‌ల‌కు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాల‌ని జాఫ‌ర్ అభిప్రాయ‌ప‌డ్డాడు.

ఈ ఏడాది ఐపీఎల్‌లో మ‌రో మ్యాచ్ త‌ర్వాత ముంబై భావిత‌వ్యం తేలిపోనుంది. ఆ మ్యాచ్‌లో ముంబై ఓట‌మి పాలైతే ప్లే ఆఫ్స్ రేసు అధికారికంగా నిష్క్ర‌మిస్తోంది. ఒకవేళ అది జరిగితే మిగిలిన మ్యాచ్‌ల‌కు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడం  బెట‌ర్‌. అది టీమిండియాకు బాగా క‌లిసిస్తోందని ఈఎస్పీఈన్ క్రిక్ ఈన్‌ఫోలో జాఫ‌ర్ పేర్కొన్నాడు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)