Breaking News

అతడి వల్లే ​ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: హార్దిక్‌

Published on Sat, 05/31/2025 - 11:00

ఐపీఎల్‌-2025లో శుక్ర‌వారం ముల్లాన్‌పూర్ వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌, గుజ‌రాత్ టైటాన్స్ మ‌ధ్య జ‌రిగిన ఎలిమినిటేర్ మ్యాచ్ స‌స్పెన్ష్ థ్రిల్ల‌ర్‌ను త‌లపించింది. ఆఖ‌రి వ‌ర‌కు ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన ఈ పోరులో గుజ‌రాత్ 20 ప‌రుగుల తేడాతో ముంబై విజ‌యం సాధించింది. దీంతో ముంబై ఇండియ‌న్స్ క్వాలిఫ‌య‌ర్‌-2కు ఆర్హ‌త సాధించింది. 

ఆదివారం జ‌ర‌గ‌నున్న సెకెండ్ క్వాలిఫ‌య‌ర్‌లో పంజాబ్ కింగ్స్‌తో ముంబై త‌ల‌ప‌డ‌నుంది. ఈ విజ‌యంపై మ్యాచ్ అనంత‌రం ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. మ్యాచ్‌ను మ‌లుపు తిప్పిన స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రాపై పాండ్యా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు.

"కీల‌క మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డం చాలా సంతోషంగా ఉంది. ఒకానొక ద‌శ‌లో గేమ్ స‌మానంగా మారింది. రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ బ్యాటింగ్‌కు మ‌రింత మెరుగ్గా అనుకూలించింది. మంచు కార‌ణంగా బంతి సునాయ‌సంగా బ్యాట్‌పైకి వ‌చ్చింది. దీంతో రిథ‌మ్ అందుకున్న గుజ‌రాత్ బ్యాట‌ర్లు దూకుడుగా ఆడ‌డం మొద‌లు పెట్టారు. ఆ స‌మ‌యంలో ఒత్తిడికి లోనవ్వ‌కుండా మా బౌల‌ర్ల‌కు స‌పోర్ట్‌గా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నాము.

ఇక జానీ బెయిర్ స్టో త‌న అరంగేట్రంలో ఆసాధ‌ర‌ణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. మాకు అత‌డు అద్బుత‌మైన ఆరంభాన్ని అందించాడు. రోహిత్ శ‌ర్మ మ‌రోసారి త‌న క్లాస్ చూపించాడు. తొలుత కాస్త నెమ్మ‌దిగా ఆడిన‌ప్ప‌టికి.. తన రిథమ్ అనుకున్న తర్వాత ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. బౌలింగ్‌లో గ్లీసన్, బుమ్రా, అశ్విన్ కుమార్ ప్రతీ ఒక్కరూ రాణించారు.

ఈ మ్యాచ్‌లో మేము ఎటువంటి ఒత్తిడి లోనవ్వలేదు. తొలి ఇన్నింగ్స్‌లో నేను మరో సిక్స్‌లు కొట్టి ఉంటే బాగుండేంది. ఎందుకంటే ఆఖరిలో చేసే పరుగులు మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపుతాయి. బ్యాటింగ్‌లో మేము అనుకున్న విధంగా దూకుడుగా ఆడాము. ఇక బుమ్రాతో ఎప్పుడు బౌలింగ్ చేయంచాలన్నది అన్నది చాలా సులభం.  మ్యాచ్ చేజారిపోతుందని అనిపిచ్చినప్పుడు బుమ్రాను ఎటాక్‌లో తీసుకురావాలి. బుమ్రా లాంటి ప్లేయర్‌ జట్టులో ఉంటే కెప్టెన్‌కు అదొక వరం.

ముంబైలో ఇళ్లు ఎంత ఖరీదుగా ఉంటాయో, బుమ్రా కూడా అంతే కాస్టలీ. చివరి ఓవర్లలో అదనపు పరుగులు ఉంచుకోగలిగితే, వాటిని డిఫెండ్ చేయగల బౌలర్లు జట్టులో ఉన్నారు అని భావించాను. అందుకే 18 ఓవర్ బుమ్రాతో వెయించాను. అందుకు తగ్గట్టే ఆ ఓవర్‌లో అతడు కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చింది. దీంతో గుజరాత్‌కు కావల్సిన రన్‌రేట్ పెరిగింది. మా తదుపురి మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను" అని హార్ధిక్ పేర్కొన్నాడు.

కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ముంబై బ్యాటర్లలో రోహిత్‌ శర్మ(81) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులకే పరిమితమైంది. గుజరాత్‌ ‍బ్యాటర్లలో సాయిసుదర్శన్‌(80) పోరాడాడు. అయితే 48 పరుగులతో దూకుడుగా ఆడుతున్న వాషింగ్టన్‌ సుందర్‌ను ఔట్‌ చేసి బుమ్రా మ్యాచ్‌ మలుపు తిప్పాడు.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)