Breaking News

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌.. బుమ్రా కీలక నిర్ణయం!

Published on Tue, 01/17/2023 - 08:09

భారత స్టార్ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా భారత జట్టులోకి తిరిగి రావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడు. బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో పునరావాసం పొం‍దుతున్నాడు. కాగా బుమ్రా వెన్ను గాయం నుంచి కోలుకున్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ అయితే సాధించలేదు. రాబోయో వారంలో బుమ్రా ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాల్గోనున్నట్లు తెలుస్తోంది.

ఫిట్‌నెస్‌ టెస్టులో బుమ్రా ఉత్తీర్ణత సాధిస్తే.. అతడు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్‌కు భారత జట్టుకు ఎంపిక అయ్యే ఛాన్స్‌ ఉంది. కాగా ఆసీస్‌తో మొదటి రెండు టెస్టులకు బీసీసీఐ ప్రకటించిన జట్టులో మాత్రం బుమ్రాకు చోటు దక్కలేదు. అయితే ఆఖరి రెండు టెస్టులకు  ఈ స్పీడ్‌స్టార్‌ ఎంపికయ్యే అవకాశం ఉంది.

ఈ క్రమంలో బుమ్రా తన ఫిట్‌నెస్‌ను నిరూపించేకునేందుకు ఆల్‌రౌండర్‌ రవీం‍ద్ర జడేజా బాటలోనే వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరగుతున్న రంజీ ట్రోఫీలో బుమ్రా ఆడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న జడేజా కూడా రంజీ ట్రోఫీలో ఆడనున్నాడు.

బుమ్రా తన వెన్ను గాయం నుంచి బాగా కోలుకుంటున్నాడు. కానీ అతడు ఇంకా 100 శాతం ఫిట్‌నెస్‌ సాధించలేదు. అతడు మళ్లీ మైదానంలో అడుగుపెట్టడానికి మరో 2 వారాల పునరావాసం అవసరం. అతడు ఫిట్‌నెస్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే, ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు తిరిగి జట్టులోకి వస్తాడు.

అయితే అతడు జట్టులో వచ్చేముందు దేశవాళీ క్రికెట్‌లో ఆడే అవకాశం ఉంది. అది సెలక్టర్లు, బమ్రా నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది అని సీనియర్‌ బీసీసీఐ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌ స్పోర్ట్‌తో పేర్కొన్నారు. కాగా బుమ్రా గాయం కారణం‍గా ఆసియాకప్‌, టీ20 ప్రపంచకప్‌కు దూరమైన సంగతి తెలిసిందే.
చదవండి: IND vs NZ: హైదరాబాద్‌ చేరుకున్న భారత జట్టు.. ఫోటోలు వైరల్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)