Breaking News

'డబుల్‌ సెంచరీ'పై కన్నేసిన బుమ్రా...

Published on Wed, 12/25/2024 - 16:49

మెల్‍బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు గురువారం(డిసెంబర్ 26) నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ బాక్సింగ్ డే టెస్టులో బుమ్రా 6 వికెట్లు పడగొడితే.. 200 టెస్టు వికెట్ల మైలురాయి అందుకుంటాడు.

తద్వారా టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా బుమ్రా నిలుస్తాడు. ఈ జాబితాలో టీమిండియా దిగ్గజ స్పిన్నర్ ఉన్నాడు. అశ్విన్ కేవలం 37 టెస్టుల్లోనే 200 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. ఇక ఇప్పటి వరకు 43 టెస్టులు ఆడిన బుమ్రా 83 ఇన్నింగ్స్‌ల్లో 194 వికెట్లు పడగొట్టాడు.

ప్రస్తుతం బుమ్రా ఉన్న ఫామ్‌కు ఈ ఫీట్ సాధించడం నల్లేరు మీద నడక అని చెప్పాలి. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2024-25లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన బుమ్రా.. 21 వికెట్లు పడగొట్టి లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు.
భారత తుది జట్టు(అంచనా)
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్‌), KL రాహుల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్ కీప‌ర్‌), ధృవ్ జురెల్‌, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్‌), మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్

ఆసీస్‌ తుది జట్టు
ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మార్నస్ లబుషేన్‌, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్‌), పాట్ కమిన్స్ (కెప్టెన్‌), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)