IND Vs ENG: చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. వసీం అక్రమ్ రికార్డు బద్దలు

Published on Sun, 06/22/2025 - 13:59

ప్రపంచ క్రికెట్‌లో ప్రస్తుతం తనను మించిన బౌలర్ లేడని టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా మరోసారి నిరూపించుకున్నాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు రెండో రోజు ఆటలో బుమ్రా నిప్పలు చెరిగాడు. మహ్మద్ సిరాజ్‌, ప్రసిద్ద్ కృష్ణ వంటి సహచర పేసర్లు తేలిపోయిన చోట.. బుమ్రా తన బౌలింగ్ స్కిల్‌తో ఆకట్టుకున్నాడు.

పిచ్, పరిస్థితులతో సంబంధం లేకుండా అతడు ప్రతి బంతికి వికెట్‌ తీసేలా అత్యంత ప్రమాదకారిగా కనిపించాడు. భారత్ పడడొట్టిన మూడు వికెట్లు కూడా బుమ్రా తీసినవే కావడం గమనార్హం. జాక్ క్రాలీ, బెన్ డకెట్‌, జో రూట్ వంటి కీలక వికెట్లు పడగొట్టి భారత్‌ను గేమ్‌లో ఉంచాడు. ఈ క్రమంలో బుమ్రా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

వసీం అ​క్రమ్ రికార్డు బ్రేక్‌..
సేనా(సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా) దేశాల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆసియా బౌలర్‌గా బుమ్రా చరిత్ర సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో బెన్ డకెట్‌ను ఔట్ చేసిన అనంతరం ఈ రికార్డును బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు. బుమ్రా ఇప్పటివరకు సేనా దేశాల్లో 148 వికెట్లు పడగొట్టాడు. ఈ రికార్డు గతంలో వసీం అక్రమ్(146) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్‌తో అక్రమ్ ఆల్‌టైమ్ రి​​​కార్డును బుమ్రా బ్రేక్ చేశాడు.

సెనా దేశాల్లో బుమ్రా రికార్డు
ఆస్ట్రేలియా- 12 మ్యాచ్‌లు- 64 వికెట్లు
ఇంగ్లాండ్ 10 మ్యాచ్‌లు- 39 వికెట్లు
న్యూజిలాండ్- 2 మ్యాచ్‌లు- 6 వికెట్లు
దక్షిణాఫ్రికా- 8 మ్యాచ్‌లు- 38 వికెట్లు

సెనా దేశాల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లు
జస్ప్రీత్ బుమ్రా 147
వసీం అక్రమ్ 146
అనిల్ కుంబ్లే 141
ఇషాంత్ శర్మ 130

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)