Breaking News

సౌరభ్ చౌదరి ఎక్క‌డ‌? రైఫిల్ స‌మాఖ్య‌పై మండిప‌డ్డ‌ మ‌ను కోచ్

Published on Mon, 08/19/2024 - 09:09

ప్యారిస్ ఒలింపిక్స్‌లో భార‌త స్టార్ షూట‌ర్ మ‌ను భాక‌ర్ రెండు కాంస్య ప‌త‌కాలు సాధించిన విష‌యం విధితమే. అయితే ఆమె విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన కోచ్ జస్పాల్ రాణా.. ఒలింపిక్స్ భార‌త‌ షూట‌ర్ల‌ సెలక్షన్ పాలసీపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెల‌క్ష‌న్ విధానాల వ‌ల్ల‌ యువ  షూటర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నార‌ని రాణా అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. 

"ఫెడ‌రేష‌న్ సెల‌క్ష‌న్ పాల‌సీ ప్ర‌తీ ఆరు నెల‌ల‌కోసారి మారుతుంది. ఈ విష‌యం గురించి ఇప్పటికే క్రీడా మంత్రితో నేను మాట్లాడాను. ఫెడరేషన్‌ నుంచి సెలక్షన్ పాలసీని తెప్పించుకోని, ఓసారి ప‌రిశీలించాల‌ని కోరాను.

అది చూశాక వారు ఏ నిర్ణ‌యం తీసుకున్న మేము క‌ట్టుబ‌డి ఉంటాము. ఆ త‌ర్వాత ఈ విష‌యం గురించి అస్స‌లు చ‌ర్చించం. షూట‌ర్ల‌కు అండ‌గా నిలిస్తే క‌చ్చితంగా వారి ప్ర‌ద‌ర్శ‌న‌లలో మ‌నం మార్పులు చూస్తాం. భారత షూటింగ్‌ ఫెడరేషన్ విధి విధానాల వ‌ల్ల ఎంతో మంది యువ షూట‌ర్లు ముందుకు వెళ్ల‌లేక‌పోతున్నారు. 

భార‌త్‌లో అత్యుత్త‌మ షూట‌ర్లు ఎంతో మంది ఉన్నారు. కానీ వారికి స‌పోర్ట్‌గా నిలిచే వారు ఎవ‌రూ లేరు. పిస్టల్ షూటర్ సౌరభ్ చౌదరి ఎక్క‌డ‌? ఆసియా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ పిస్టల్ షూటర్ జితూ రాయ్ ఎక్క‌డ‌?   వీరిగురించి ఎవ‌రూ మాట్ల‌డటం లేదు. 

పారిస్‌లో నాలుగో స్థానంలో నిలిచిన (10మీ ఎయిర్ రైఫిల్ షూటర్) అర్జున్ బాబుటా గురించి అస్సలు చర్చే లేదు. అతను స్వల్ప తేడాతో పతకాన్ని కోల్పోయాడు.  మళ్లీ అతడిని ఈ ప్లాట్‌ఫామ్‌కు తీసుకు రావాలని ఎవరూ ఆలోచించడం లేదని" పీటీఐకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో జస్పాల్ రాణా పేర్కొన్నాడు.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)