Breaking News

పాకిస్తాన్‌ ఆల్‌ ఫార్మాట్‌ కోచ్‌గా జేసన్‌ గిల్లెస్పీ

Published on Mon, 10/28/2024 - 13:41

పాకిస్తాన్‌ ఆల్‌ ఫార్మాట్‌ హెడ్‌ కోచ్‌గా జేసన్‌ గిల్లెస్పీ నియమితుడయ్యాడు. పరిమిత ఓవర్ల హెడ్‌ కోచ్‌ పదవికి గ్యారీ కిర్‌స్టన్‌ రాజీనామా చేసిన నేపథ్యంలో గిల్లెస్పీ ఎంపిక జరిగింది. ఆల్‌ ఫార్మాట్‌ కోచ్‌గా ఎంపిక కాకముందు గిల్లెస్పీ కేవలం టెస్ట్‌లకు మాత్రమే కోచ్‌గా వ్యవహరించే వాడు. 

గిల్లెస్పీ త్వరలో ఆస్ట్రేలియాలో పర్యటించబోయే పాక్‌ జట్టుకు హెడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తాడు. ఆటగాళ్లతో, క్రికెట్‌ బోర్డుతో విభేదాల కారణంగా కిర్‌స్టన్‌ హెడ్‌ కోచ్‌ పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. హై పెర్ఫార్మెన్‌ కోచ్‌గా డేవిడ్‌ రీడ్‌ను నియమించాలని కిర్‌స్టన్‌ కోరగా.. పాక్‌ క్రికెట్‌ బోర్డు అందుకు నిరాకరించినట్లు సమాచారం.

కాగా, ఇటీవలికాలంలో పాక్‌ క్రికెట్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మూడు నెలల కాలంలో మూడు సార్లు సెలక్షన్‌ ప్యానెల్‌లో మార్పులు చేసిన పీసీబీ.. తాజాగా గ్యారీ కిర్‌స్టన్‌ హెడ్‌ పదవి నుంచి తప్పుకునేలా చేసింది. ఇటీవలే బాబర్‌ ఆజమ్‌ పాక్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. 

దీంతో నిన్ననే బాబర్‌ స్థానంలో పాక్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా మహ్మద్‌ రిజ్వాన్‌ను నియమించారు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో చివరి రెండు టెస్ట్‌లకు బాబర్‌ ఆజమ్‌, షాహీన్‌ అఫ్రిది, నసీం షాలను తప్పించారు. ఈ అంశం అప్పట్లో పాక్‌ క్రికెట్‌ను కుదిపేసింది. అయితే ఈ ముగ్గురు స్టార్లు లేకపోయినా పాక్‌ ఇంగ్లండ్‌పై టెస్ట్‌ సిరీస్‌లో గెలవడం​ కొసమెరుపు. 

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)