Breaking News

యూఎస్ ఓపెన్ ఛాంపియన్‌గా సిన్నర్..

Published on Mon, 09/09/2024 - 08:09

యూఎస్  ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత‌గా ప్రపంచ నంబర్ వన్, ఇట‌లీ టెన్నిస్ స్టార్ జానిక్ సిన్నర్ నిలిచాడు. ఆదివారం అర్ధ‌రాత్రి దాటాక న్యూయార్క్‌లోని ఆర్థర్ ఆషే స్టేడియంలో జ‌రిగిన ఫైన‌ల్ పోరులో అమెరికాకు చెందిన టేలర్ ఫ్రిట్జ్‌పై  6-3, 6-4 , 7-5 తేడాతో సిన్న‌ర్ విజ‌యం సాధించాడు.

దాదాపు రెండు గంట‌ల పాటు సాగిన తుది పోరులో ప్ర‌త్య‌ర్ధిని సిన్న‌ర్ చిత్తు చేశాడు. మూడు సెట్ల‌లోనూ పూర్తి ఆధిప‌త్యం సాధించిన ఈ ఇటాలియన్ స్టార్‌.. తొలి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. 23 ఏళ్ల సిన్న‌ర్‌కు ఈ ఏడాదిలో ఇది రెండవ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావ‌డం విశేషం. 

ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను గెలుచుకోగా.. తాజాగా ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్‌ను కూడా సిన్న‌ర్ సొంతం చేసుకున్నాడు.

తొలి ఇటాలియాన్‌గా..
అదే విధంగా యూఎస్ ఓపెన్ ట్రోఫీని సొంతం చేసుకున్న‌ మొట్టమొదటి ఇటాలియన్‌గా సిన్న‌ర్ చ‌రిత్ర‌కెక్కాడు. ఇప్పటివరకు ఏ ఇటలీ టెన్నిస్‌ క్రీడాకారుడు కూడా యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ను గెలవలేదు. ఇక ఈ ట్రోఫీని టెన్నిస్ దిగ్గజం ఆండ్రీ అగస్సీ చేతుల మీదుగా సిన్నర్‌ అందుకున్నాడు.
చదవండి: ENG VS SL 3rd Test: రూట్‌ ఖాతాలో భారీ రికార్డు

#

Tags : 1

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు