Breaking News

సినెర్‌ అలవోకగా...

Published on Thu, 11/14/2024 - 01:57

ట్యూరిన్‌ (ఇటలీ): సొంతగడ్డపై ఇటలీ టెన్నిస్‌ సూపర్‌స్టార్‌ యానిక్‌ సినెర్‌ మరోసారి అద్భుత ప్రదర్శన చేశాడు. పురుషుల టెన్నిస్‌ సీజన్‌ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో టాప్‌ సీడ్‌ సినెర్‌ వరుసగా రెండో విజయం సాధించాడు. ‘ఇలీ నస్టాసే గ్రూప్‌’లో భాగంగా టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా)తో జరిగిన మ్యాచ్‌లో సినెర్‌ 6–4, 6–4తో గెలుపొందాడు. 

ఈ విజయంతో సినెర్‌కు సెమీఫైనల్‌ బెర్త్‌ దాదాపు ఖరారైంది. గంటా 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సినెర్‌ ఆరు ఏస్‌లు సంధించాడు. ఒక్క డబుల్‌ ఫాల్ట్‌ కూడా చేయలేదు. ఒక్కో సెట్‌లో ఒక్కోసారి ఫ్రిట్జ్‌ సర్వీస్‌ను సినెర్‌ బ్రేక్‌ చేశాడు. నెట్‌ వద్దకు 10 సార్లు దూసుకొచ్చి 9 సార్లు పాయింట్లు గెలిచాడు. 21 విన్నర్స్‌ కొట్టిన అతను 22 అనవసర తప్పిదాలు చేశాడు. 

మరోవైపు ఫ్రిట్జ్‌ ఏడు ఏస్‌లతో రాణించినా తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి మూల్యం చెల్లించుకున్నాడు. 20 విన్నర్స్‌ కొట్టిన ఫ్రిట్జ్‌ 31 అనవసర తప్పిదాలు చేశాడు.  

‘జాన్‌ న్యూకోంబ్‌ గ్రూప్‌’లో ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ తొలి విజయం నమోదు చేసుకున్నాడు. ఆండ్రీ రుబ్లెవ్‌ (రష్యా)తో జరిగిన రెండో లీగ్‌ మ్యాచ్‌లో అల్‌కరాజ్‌ 6–3, 7–6 (10/8)తో గెలుపొందాడు. గంటా 36 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అల్‌కరాజ్‌ 10 ఏస్‌లు సంధించాడు. రెండుసార్లు రుబ్లెవ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన అల్‌కరాజ్‌ 33 విన్నర్స్‌తో అలరించాడు. 

బోపన్న జోడీకి మరో ఓటమి 
ఇదే టోర్నీ పురుషుల డబుల్స్‌ విభాగంలో రోహన్‌ బోపన్న (భారత్‌)–మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) జోడీకి వరుసగా రెండో పరాజయం ఎదురైంది. మార్సెలో అరెవాలో (ఎల్‌ సాల్వడార్‌)–మ్యాట్‌ పావిచ్‌ (క్రొయేíÙయా) జంటతో జరిగిన మ్యాచ్‌లో బోపన్న–ఎబ్డెన్‌ జోడీ 5–7, 3–6తో ఓడిపోయింది.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)