Breaking News

హెల్మెట్‌పై 'పాలస్తీనా జెండా' ధరించిన జమ్మూ కశ్మీర్‌ క్రికెటర్‌

Published on Thu, 01/01/2026 - 20:15

జమ్ము అండ్ కశ్మీర్‌లో ఓ స్థానిక వ్యక్తి హెల్మెట్‌పై పాలస్తీనా జెండా ధరించి క్రికెట్మ్యాచ్ఆడటం వివాదాస్పదంగా మారింది. జమ్ము కశ్మీర్‌ ఛాంపియన్స్ లీగ్ పేరిట జరుగుతున్న క్రికెట్టోర్నీలో ఫుర్కాన్‌ భట్‌ అనే ప్లేయర్ఉద్దేశపూర్వకంగా ఇలా చేశాడు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఫుర్కాన్తో పాటు టోర్నీ నిర్వాహకుడు జాహిద్ భట్‌కు సమన్లు జారీ చేశారు.

వివాదంపై జమ్మూ అండ్కశ్మీర్క్రికెట్అసోసియేషన్‌ (JKCA) స్పందించింది. జమ్ము కశ్మీర్‌ ఛాంపియన్స్ లీగ్ JKCA గుర్తింపు పొందింది కాదని స్పష్టం చేసింది. ఫుర్కాన్అనే ఆటగాడు JKCA లేదా దాని అనుబంధ సంస్థల్లో ఎక్కడా నమోదు కాలేదని తేల్చి చెప్పింది. కాగా, భారత పౌరసత్వం కలిగిన వ్యక్తి అయినా పరాయి దేశ జెండాలను వాడటం అనేది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది.

ఇదే నేరం ఏదైనా రాష్ట్రానికి చెందిన క్రికెట్అసోసియేషన్కు సంబంధించిన వ్యక్తి చేస్తే మరింత తీవ్రమైందిగా పరిగణించడబడుతుంది. ఫుర్కాన్అనే వ్యక్తి స్థానిక క్రికెట్అసోసియేషన్తో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి కావడంతో వివాదం పెద్దది కాలేదు.

ఇదిలా ఉంటే, జమ్ము అండ్‌ కశ్మీర్‌లో ఇటీవలికాలంలో అనధికారిక క్రికెట్లీగ్లు ఎక్కువయ్యాయి. ఇదే ఏడాది ఇక్కడ జరిగిన ఇండియన్ హెవెన్ ప్రీమియర్ లీగ్ (IHPL) వివాదాస్పదంగా మారింది. టోర్నీలో చాలామంది అంతర్జాతీయ క్రికెటర్లు పాల్గొన్నారు

లీగ్నిర్వాహకులు ఆటగాళ్లు, హోటల్ యజమానులను మోసం చేసి మధ్యలోనే పరారయ్యారు. లీగ్లో క్రిస్ గేల్, మార్టిన్ గప్టిల్ లాంటి అంతర్జాతీయ స్టార్లు పాల్గొన్నారు.

Videos

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు