Breaking News

7 వికెట్లతో చెలరేగిన అండర్సన్‌.. ఇక విండీస్‌కు చుక్కలే!

Published on Tue, 07/02/2024 - 22:04

ఇంగ్లండ్ వెట‌ర‌న్ పేస‌ర్ జేమ్స్ ఆండర్సన్ తన కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యాడు. జూలై 10 నుంచి లార్డ్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరగనున్న తొలి టెస్టు అనంతరం ఆండర్సన్ తన 22 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు విడ్కోలు పలకనున్నాడు. 

అయితే తన ఆఖరి టెస్టుకు ముందు  ఆండర్సన్ నిప్పలు చేరిగాడు.  కౌంటీ చాంపియ‌న్‌షిప్‌లో లాంక్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అండర్సన్‌.. నాటింగ్‌హ‌మ్‌షైర్ బ్యాట‌ర్ల‌కు చుక్కలు చూపించాడు. 

ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆండర్సన్  ఏకంగా 7 వికెట్లు ప‌డ‌గొట్టి స‌త్తాచాటాడు. 16 ఓవ‌ర్లు వేసిన అండ‌ర్సన్ కేవలం 35 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చాడు. ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో 6 వికెట్ల పైగా అండ‌ర్స‌న్ ప‌డ‌గొట్ట‌డం ఇది 16వ సారి కావ‌డం గ‌మ‌నార్హం. అండర్సన్‌ నిప్పులు చేరగడంతో నాటింగ్‌హ‌మ్‌షైర్ 126 పరుగులకే కుప్పకూలింది. తొలుత బ్యాటింగ్ చేసిన లాంక్‌షైర్ 353 ప‌రుగుల వ‌ద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 

ఇక ఆండ‌ర్స‌న్‌కు వ‌ర‌ల్డ్‌క్రికెట్‌లో ప్ర‌త్యేక‌మైన స్ధానం ఉంది. 41 ఏళ్ల ఆండ‌ర్స‌న్ టెస్టుల్లో 700 వికెట్లు తీసిన ఏకైక బౌల‌ర్‌గా కొన‌సాగుతున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు 187 టెస్టులు, 194 వన్డేలు, 19 టీ20ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఓవ‌రాల్‌గా 400 అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆండ‌ర్స‌న్ 987 వికెట్లు ప‌డగొట్టాడు.

 

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)