శెభాష్ ఆండ‌ర్స‌న్‌.. వీడ్కోలు మ్యాచ్‌లో వ‌ర‌ల్డ్ రికార్డు

Published on Fri, 07/12/2024 - 07:39

త‌న కెరీర్‌లో చివ‌రి టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న ఇంగ్లండ్ వెట‌ర‌న్ పేస‌ర్ జేమ్స్ ఆండర్సన్ నిప్పులు చేరుగుతున్నాడు. లార్డ్స్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో ఆండ‌ర్స‌న్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నాడు.

తొలి ఇన్నింగ్స్‌లో ఓ కీల‌క వికెట్ ప‌డ‌గొట్టిన ఆండ‌ర్స‌న్‌.. రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ బ్యాట‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తున్నాడు. ఆదిలోనే రెండు వికెట్లు ప‌డ‌గొట్టి విండీస్‌ను దెబ్బ‌తీశాడు. అయితే త‌న విడ్కోలు టెస్టులో ఆండ‌ర్స‌న్ ఓ అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు.

టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో  40,000 బంతులు వేసిన తొలి ఫాస్ట్ బౌల‌ర్‌గా ఆండ‌ర్స‌న్ రికార్డులెక్కాడు. ఈ మ్యాచ్‌లో తన 10వ ఓవర్ వేసిన అనంత‌రం ఆండ‌ర్స‌న్ ఈ రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు 188 టెస్టులు ఆడిన ఆండ‌ర్స‌న్‌.. 6666. 5(40000 బంతులు) ఓవ‌ర్లు బౌలింగ్ చేశాడు. 

ఓవ‌రాల్‌గా ఈ ఘ‌నత సాధించిన జాబితాలో ఆండ‌ర్స‌న్ నాలుగో స్ధానంలో ఉన్నాడు. ఈ జాబితాలో దిగ్గ‌జ స్పిన్న‌ర్లు ఆండ‌ర్స‌న్ కంటే ముందు అనిల్ కుంబ్లే(44039), షేన్ వార్న్(40850), ముత్తయ్య మురళీధరన్‌(40705) ఉన్నారు.

అదేవిధంగా ఆండ‌ర్స‌న్ మ‌రో రికార్డును కూడా త‌న పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో విండీస్‌పై అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టిన రెండో బౌల‌ర్‌గా ఆండ‌ర్స‌న్ నిలిచాడు. ఆండ‌ర్స‌న్ ఇప్ప‌టివ‌ర‌కు వెస్టిండీస్‌పై 90 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

 ఇంత‌కుముందు ఈ రికార్డు భార‌త క్రికెట్ దిగ్గ‌జం క‌పిల్ దేవ్(89) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో క‌పిల్ దేవ్ రికార్డును ఆండ‌ర్స‌న్ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో గ్లెన్ మెక్‌గ్రాత్(110) తొలి స్ధానంలో ఉన్నాడు.

 

Videos

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)