Breaking News

'అలా అయితే యాషెస్‌లో నా కథ ముగిసినట్లే!'

Published on Sat, 06/24/2023 - 10:51

ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌.. జేమ్స్‌ అండర్సన్‌ నిస్సందేహంగా ఈ తరంలో ఒక గొప్ప ఫాస్ట్‌ బౌలర్‌ అని చెప్పొచ్చు. స్వింగ్‌ కింగ్‌గా పేరొందిన అండర్సన్‌ తన బౌలింగ్‌తో ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టి ఇంగ్లండ్‌కు ఎన్నో విజయాలు అందించాడు. ఇరుదేశాలు ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్‌ సిరీస్‌లోనూ అండర్సన్‌ కీలకపాత్ర పోషించాడు.

2015లో ఇంగ్లండ్‌ యాషెస్‌ గెలవడంలో అండర్సన్‌దే ముఖ్యపాత్ర. అలాంటి అండర్సన్‌ బౌలింగ్‌లో పదును తగ్గినట్లు అనిపిస్తోంది. ఇటీవలే ప్రారంభమైన యాషెస్‌ సిరీస్‌ 2023లో అండర్సన్‌ ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే పడగొట్టాడు. అయితే ఈ ఒక్క ప్రదర్శనతో అతనికి వచ్చిన నష్టం ఏం లేదు. ఎందుకంటే బెన్‌ స్టోక్స్‌ అండర్సన్‌ను బాగా నమ్ముతాడు. అందుకే రెండో టెస్టులో రాణించి స్టోక్స్‌ నమ్మకాన్ని నిలబెట్టాలని అనుకుంటున్నాడు.

ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు సిద్ధమవుతున్న అండర్సన్‌ ఎడ్జ్‌బాస్టన్‌ పిచ్‌పై విమర్శలు గుప్పించాడు. ''లార్డ్స్‌ వేదికగా జరగనున్న రెండో టెస్టులో నా బౌలింగ్‌ పదును చూపించాలనుకుంటున్నా. కానీ ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టు పిచ్‌ ఫ్లాట్‌గా ఉంది. యాషెస్‌ సిరీస్‌లో జరిగే మిగతా టెస్టుల్లోనూ పిచ్‌ ఇలాగే ఉంటే మాత్రం యాషెస్‌తో నా బంధం ముగిసినట్లే.

ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో పిచ్‌పై స్వింగ్‌, రివర్స్‌ సింగ్‌ లేవు.. సీమ్‌ బౌన్స్‌ అసలే లేదు.. కనీసం పేస్‌ బౌలింగ్‌కు కూడా అనుకూలంగా లేదు. రానున్న మ్యాచ్‌ల్లో పేస్‌కు అనుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నా. ఇక ఎన్నో ఏళ్లుగా ఇంగ్లండ్‌కు ప్రధాన బౌలర్‌గా ఉన్నా. నా బౌలింగ్‌ స్కిల్స్‌తో ఎలాంటి కండీషన్స్‌లోనైనా వికెట్లు రాబట్టే ప్రయత్నం చేశా.. కానీ ఎడ్జ్‌బాస్టన్‌ పిచ్‌ మొదటిసారి కొత్తగా కనిపించింది. ఇలాగే ఉంటే యాషెస్‌తో నా బంధం ముగిసినట్లే(అంటే జట్టులో చోటు కోల్పోవడమే) అని అర్థం'' అంటూ వివరించాడు.

చదవండి: టీమిండియాకు దూరం.. పుజారా కీలక నిర్ణయం, సూర్య కూడా

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)