ఇంత త్వరగా వస్తాడనుకోలేదు: ధోనిపై సెహ్వాగ్‌ ఘాటు విమర్శలు

Published on Sat, 03/29/2025 - 12:47

చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) స్టార్‌ మహేంద్ర సింగ్‌ ధోని (MS Dhoni) ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB)తో మ్యాచ్‌లో ‘తలా’ అంత త్వరగా బ్యాటింగ్‌కు వస్తాడని ఊహించలేదన్నాడు. ఇందుకు కారణమేమిటో తనకు అర్థంకాలేదంటూ సీఎస్‌కే బ్యాటర్లపై జోకులు వేశాడు.

ఐపీఎల్‌-2025లో భాగంగా సీఎస్‌కే శుక్రవారం ఆర్సీబీతో తలపడింది. సొంతమైదానం చెపాక్‌లో టాస్‌ గెలిచిన చెన్నై.. ప్రత్యర్థిని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 196 పరుగులు చేసింది. అయితే, లక్ష్య ఛేదనలో చెన్నై 146 పరుగులకే పరిమితమైంది.

ఓపెనర్లలో రచిన్‌ రవీంద్ర (31 బంతుల్లో 41) ఫర్వాలేదనిపించగా.. రాహుల్‌ త్రిపాఠి (5) మరోసారి విఫలమయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ మరీ ఘోరంగా డకౌట్‌ అయ్యాడు. ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌ చేసిన దీపక్‌ హుడా 4, సామ్‌ కర్రన్‌ 8, శివం దూబే 19 పరుగులకు వెనుదిరిగారు.

తొమ్మిదో స్థానంలో ధోని
ఈ క్రమంలో ఏడో స్థానంలో రవీంద్ర జడేజా (19 బంతుల్లో 25) రాగా.. రవిచంద్రన్‌ అశ్విన్‌(8 బంతుల్లో 11) ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌ చేశాడు. ఇక పవర్‌ఫుల్‌ ఫినిషర్‌గా పేర్కొంది ధోని తొమ్మిదో నంబర్‌లో బ్యాట్‌తో రంగంలోకి దిగి 16 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. 

అతడి ధనాధన్‌ ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అయితే, జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ ఆల్‌రౌండర్ల తర్వాత ధోని బ్యాటింగ్‌కు రావడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

43 ఏళ్ల ధోనిని కేవలం వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా మాత్రమే జట్టులో ఉంచితే.. సీఎస్‌కే మున్ముందు మరిన్ని చేదు అనుభవాలు చూస్తుందనే హెచ్చరికలు వస్తున్నాయి. జట్టుకు అవసరమైన వేళనైనా తలా ఇంకాస్త ముందుగా బ్యాటింగ్‌కు రావాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్‌, మనోజ్‌ తివారి ధోనిపై క్రిక్‌బజ్‌ షోలో జోకులు వేశారు. సెహ్వాగ్‌ మాట్లాడుతూ.. ‘‘ఈసారి చాలా తొందరగానే బ్యాటింగ్‌కు వచ్చాడే!’’ అని సెటైర్‌ వేయగా.. ‘‘అవును.. నేనైతే అతడు పదో స్థానంలో వస్తాడేమో అనుకున్నా’’ అని బదులిచ్చాడు.

IPL : ధోనీపై విమర్శలు!

అతడు తొందరగా బ్యాటింగ్‌కు వచ్చాడా?
ఇందుకు స్పందిస్తూ.. ‘‘16 ఓవర్ల ఆట పూర్తైన తర్వాత వచ్చాడు. మామూలుగా అయితే, 19 లేదా 20వ ఓవర్లోనే అతడు బ్యాటింగ్‌కు వస్తాడు. అందుకే త్వరగా వచ్చాడని అన్నాను. మీకూ అలాగే అనిపిస్తోందా?

అతడు తొందరగా బ్యాటింగ్‌కు వచ్చాడా? లేదంటే మిగతా బ్యాటర్లు త్వరత్వరగా వికెట్లు కోల్పోయి అతడిని రప్పించారా?’’ అని సెహ్వాగ్‌ వ్యంగ్యంగా కామెంట్లు చేశాడు. 

కాగా ధోని ఈ మ్యాచ్‌లో 30 పరుగులు చేసిన క్రమంలో.. సీఎస్‌కే తరఫున అత్యధిక పరుగులు (204 ఇన్నింగ్స్‌లో 4699) సాధించిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు సురేశ్‌ రైనా పేరిట ఉండేది. అతడు చెన్నై తరఫున 171 ఇన్నింగ్స్‌ ఆడి 4687 పరుగులు చేశాడు.  

ఐపీఎల్‌-2025: చెన్నై వర్సెస్‌ బెంగళూరు
👉 బెంగళూరు స్కోరు: 196/7 (20)
👉చెన్నై స్కోరు: 146/8 (20)
👉ఫలితం: యాభై పరుగుల తేడాతో చెన్నైపై బెంగళూరు విజయం.

చదవండి: ఇదేం ప్రశ్న? ఆఖర్లో ఎవరు గెలుస్తారో చూడాలి: సీఎస్‌కే కోచ్‌ ఆగ్రహం

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)