Breaking News

World Boxing Championships 2025: చరిత్ర సృష్టించిన భారత బాక్సర్‌

Published on Sun, 09/14/2025 - 09:24

భారత బాక్సింగ్ చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించబడింది. లివర్‌పూల్‌లో జరుగుతున్న వరల్డ్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌-2025లో ముగ్గురు మహిళా బాక్సర్లు పతకాలు సాధించారు. నుపూర్ 80 ప్లస్‌ కేజీల విభాగంలో రజత పతకం సాధించగా.. పూజా రాణి 80 కేజీల విభాగంలో కాంస్యం​.. తాజాగా జైస్మిన్ లంబోరియా 57 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. వరల్డ్ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇప్పటివరకు వచ్చిన అత్యుత్తమ ఫలితం (ముగ్గురు మహిళా బాక్సర్లకు పతకాలు) ఇదే.

చరిత్ర సృష్టించిన లంబోరియా 
తాజాగా జరిగిన 57 కేజీల విభాగం​ ఫైనల్లో జైస్మిన్ లంబోరియా పోలాండ్‌కి చెందిన ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ జూలియా సెరెమెటాపై 4-1 స్ప్లిట్ డెసిషన్‌తో విజయం  సాధించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. వరల్డ్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం. నూతన గ్లోబల్‌ బాక్సింగ్‌ గవర్నింగ్‌ బాడీగా 'వరల్డ్‌ బాక్సింగ్‌' ఏర్పడ్డాక జరుగుతున్న తొలి వరల్డ్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ ఇదే.

నుపూర్‌కు రజతం
ఇదే టోర్నీలో 80 ప్లస్‌ కేజీల విభాగంలో నుపుర్‌ గోల్డ్‌ మిస్‌ అయ్యింది. అగాటా కాజ్‌మార్స్కాతో (పోలాండ్) ఫైనల్‌లో నుపుర్‌ 2-3తో పోరాడి ఓడింది.

పూజా రాణికి కాంస్యం
80 కేజీల విభాగంలో పూజా రాణి కాంస్యంతో సరిపెట్టుకుంది. ఇంగ్లండ్‌కి చెందిన ఎమిలీ ఆస్క్విత్‌తో సెమీఫైనల్‌లో గట్టిగానే పోరాడింది.

భారత బాక్సింగ్‌లో చారిత్రక ఘట్టం
భారత బాక్సింగ్‌ చరిత్రలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. వరల్డ్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో తొలిసారి ముగ్గురు మహిళా బాక్సర్లు ఫైనల్స్‌కు చేరారు. జైస్మిన్‌, నుపుర్‌ ఇది వరకే స్వర్ణం, రజతం సాధించగా.. మీనాక్షి 48 కేజీ విభాగంలో స్వర్ణం​ కోసం​ పోటీపడాల్సి ఉంది. 

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)