Breaking News

అర్జున్‌ అదరహో

Published on Wed, 12/11/2024 - 04:05

పుణే: స్టార్‌ రెయిడర్‌ అర్జున్‌ దేశ్వాల్‌ 13 పాయింట్లతో సత్తా చాటాడు. దాంతో ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 11వ సీజన్‌లో జైపూర్‌ పింక్‌పాంథర్స్‌ తొమ్మిదో విజయం నమోదు చేసుకుంది. మంగళవారం జరిగిన ఈ పోరులో పింక్‌పాంథర్స్‌ 42–29 పాయింట్ల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌పై విజయం సాధించింది. మ్యాచ్‌ ఆరంభం నుంచి సూపర్‌ రెయిడ్‌లతో అర్జున్‌ అదరగొట్టగా... నీరజ్‌ నర్వాల్‌ (8 పాయింట్లు) అతడికి సహకరించాడు. 

గుజరాత్‌ జెయింట్స్‌ జట్టు తరఫున గుమాన్‌ సింగ్, రాకేశ్‌ చెరో 9 పాయింట్లు సాధించారు. తాజా సీజన్‌లో 18 మ్యాచ్‌లు ఆడిన జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ 9 విజయాలు, 7 పరాజయాలు, 2 ‘టై’లతో 54 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు గుజరాత్‌ కేవలం ఐదు విజయాలతో పట్టికలో 11వ స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో బెంగాల్‌ వారియర్స్‌ 44–29 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. 

వారియర్స్‌ తరఫున విశ్వాస్‌ 14 పాయింట్లు, ప్రణయ్‌ 9 పాయింట్లతో రాణించగా... బెంగళూరు తరఫున స్టార్‌ రెయిడర్, ‘డుబ్కీ కింగ్‌’ ప్రదీప్‌ నర్వాల్‌ 14 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో బెంగళూరు బుల్స్‌ (రాత్రి 8 గంటలకు), యు ముంబాతో తమిళ్‌ తలైవాస్‌ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి.   

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)