Breaking News

జాదవ్‌కు స్వర్ణం పర్నీత్‌కు రజతం

Published on Sun, 07/27/2025 - 04:18

రినె–రుర్‌ ఎసెన్‌ (జర్మనీ): ప్రపంచ యూనివర్సిటీ క్రీడల్లో భారత ఆర్చర్‌ సాహిల్‌ జాదవ్‌ స్వర్ణంపై పెట్టిన గురి కుదిరింది. పురుషుల వ్యక్తిగత కాంపౌండ్‌ విభాగంలో అతను బంగారు పతకం సాధించాడు. అయితే మహిళల కాంపౌండ్‌లో పర్నీత్‌ కౌర్‌కు తృటిలో పసిడి పతకం చేజారింది. ఆర్చర్లు ఐదు పతకాలతో ఈ పోటీలను ముగించారు. మిగతా మూడు పతకాలు టీమ్‌ ఈవెంట్‌లో వచ్చాయి. మిక్స్‌డ్‌ టీమ్‌ స్వర్ణం, పురుషుల టీమ్‌ రజతం, మహిళల టీమ్‌ కాంస్యం గెలుచుకుంది. ఒలింపిక్‌ క్రీడ అయిన రికర్వ్‌లో మాత్రం భారత ఆర్చర్లు నిరాశపరిచారు. 

పురుషుల కాంపౌండ్‌ టైటిల్‌ పోరులో సాహిల్‌ జాదవ్‌ గురి అదిరింది. మొత్తం 15 బాణాలను సంధించగా... ఇందులో ఏకంగా 14 షాట్లు కచ్చితత్వంతో లక్ష్యాన్ని చేరాయి. దీంతో పదికి పది పాయింట్లు లభించగా, ఆఖరి బాణం 9 పాయింట్లు తెచ్చింది. దీంతో జాదవ్‌ 149–148 స్కోరుతో అజయ్‌ స్కాట్‌ (బ్రిటన్‌)పై గెలిచి బంగారం అందుకున్నాడు. అంతకుముందు భారతీయుల మధ్యే జరిగిన సెమీస్‌లో సాహిల్‌ 148–148తో కుశాల్‌ దలాల్‌తో సమంగా నిలిచాడు. అయితే షూటాఫ్‌లో సాహిల్‌ జాదవ్‌ మెరుగైన స్థితిలో ఉండటంతో ఫైనల్‌ చేరాడు. 

మహిళల కాంపౌండ్‌లో ఆసియా క్రీడల టీమ్‌ఈవెంట్‌ స్వర్ణ పతక విజేత అయిన పర్నీత్‌ కౌర్‌ దాదాపు స్వర్ణంపైనే గురిపెట్టింది. కానీ ఆఖరి మెట్టుపై అనూహ్యంగా ఒత్తిడికి గురై తృటిలో పసిడి పట్టలేకపోయింది. చివరకు పాయింట్‌ తేడాతో బంగారాన్ని దూరం చేసుకున్న పర్నీత్‌ రజతంతో సరిపెట్టుకుంది. ఫైనల్లో ఆమె 146–147 స్కోరుతో మూన్‌ యీన్‌ (దక్షిణ కొరియా) చేతిలో ఓడింది. అంతకుముందు క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో టాపర్‌గా నిలిచింది. సెమీస్‌లో 145–144తో ఐదో సీడ్‌ కిమ్‌ సూయెన్‌ (దక్షిణ కొరియా)ను కంగుతినిపించింది. 

#

Tags : 1

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)