Breaking News

'రాహుల్‌ గెలిపించి ఉండొచ్చు.. కానీ నిన్ను మరువం'

Published on Fri, 03/17/2023 - 21:52

ముంబైలోని వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. లక్ష్యం చిన్నదే అయినప్పటికి టీమిండియా తడబడింది. ఆసీస్‌ బౌలర్ల ధాటికి టాపార్డర్‌ కకావికలం అయింది. 39 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మధ్యలో పాండ్యా కాస్త ప్రతిఘటించినా రాహుల్‌తో కలిసి 43 పరుగులు జోడించాకా అతను ఔటయ్యాడు.  తనపై వస్తున్న విమర్శలకు చెక్‌ పెట్టేలా ఒక మంచి ఇన్నింగ్స్‌ ఆడాలని కంకణం కట్టుకున్న రాహుల్‌ మాత్రం ఒక ఎండ్‌లో పాతుకుపోయాడు. కానీ అతనికి సహకరించేవారు కరువయ్యారు.

అప్పుడు వచ్చాడు రవీంద్ర జడేజా. ఆల్‌రౌండర్‌గా తానేంటో అందరికి తెలుసు. కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ టీమిండియా కష్టాల్లో ఉంది. ఈ దశలో అతను కూడా ఔటైతే టీమిండియా ఓడడం ఖాయం. కానీ జడేజా అలా చేయలేదు. మరోసారి తన విలువేంటో చూపిస్తూ ఒక మంచి ఇన్నింగ్స్‌తో మెరిశాడు. కెరీర్‌ గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ ఆడుతున్న కేఎల్‌ రాహుల్‌కు సహకరిస్తూ తన వంతు పాత్రను సమర్థంగా పోషించాడు. ఇద్దరు కలిసి ఆరో వికెట్‌కు అజేయంగా 108 పరుగులు జోడించారు.

ఎంత రాహుల్‌ ఆపద్భాందవుడి పాత్రను పోషించి జట్టును గెలిపించినప్పటికి జడేజా లేకపోతే అతను ఆ ఇన్నింగ్స్‌ ఆడేవాడు కాదు.  అందుకే విజయంలో కేఎల్‌ రాహుల్‌ది ఎంత ముఖ్యపాత్రో.. అంతే స్థాయి విలువ జడేజా ఇన్నింగ్స్‌కు ఉంది. మొత్తంగా 69 బంతుల్లో ఐదు ఫోర్ల సాయంతో 45 పరుగులు నాటౌట్‌గా నిలిచిన జడేజా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

కాగా జడ్డూ ఇన్నింగ్స్‌పై అభిమానులు స్పందించారు. ''కేఎల్‌ రాహుల్‌ మ్యాచ్‌ను గెలిపించి ఉండొచ్చు.. కానీ నిన్ను మరువం''.. ''మరోసారి నువ్వేంటో చూపించావు జడేజా.. నీ ఆటకు ఫిదా'' అంటూ కామెంట్‌ చేశారు.

చదవండి: గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ ఆడిన రాహుల్; తొలి వన్డే టీమిండియాదే

KL Rahul: ఒక్క ఇన్నింగ్స్‌తో అన్నింటికి చెక్‌.. 

Videos

పాక్ లో నన్ను పెళ్లి చేసుకో.. టెర్రరిస్టులతో జ్యోతి లవ్ స్టోరీ

గరం ఛాయ్ సెలబ్రేషన్స్

మాపై కక్ష ఉంటే తీర్చుకోండి.. కానీ 18వేల మంది కుటుంబాలను రోడ్డున పడేయకండి..

ఢిల్లీ ఢమాల్.. ప్లే ఆఫ్ కు ముంబై

Big Question: అరెస్టులు తప్ప ఆధారాలు లేవు.. మద్యం కేసు మటాష్

కూటమి ప్రభుత్వ అరాచకాలను, దాష్టికాలను దీటుగా ఎదుర్కొందాం: YS జగన్

ఇవాళ ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ ప్రెస్ మీట్...

అమెరికా గోల్డెన్ డోమ్.. అంతరిక్షంలో ఆయుధాలు

మావోయిస్ట్ పార్టీని ఊచకోత కోస్తోన్న ఆపరేషన్ కగార్

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

Photos

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)