Breaking News

రవీంద్ర జడేజాలా అతడు కూడా త్రీడీ క్రికెటర్‌.. డేంజరస్‌ హిట్టర్‌! కాబట్టి..

Published on Sun, 07/02/2023 - 12:56

ICC ODI WOrld CUp 2023: వన్డే ప్రపంచకప్‌-2023లో పాకిస్తాన్‌ ప్రధాన స్పిన్నర్‌గా షాదాబ్‌ ఖాన్‌ను ఎంచుకున్నాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ మాథ్యూ హెడెన్‌. టీమిండియాకు రవీంద్ర జడేజాలాగా పాక్‌కు షాదాబ్‌ ఉన్నాడని వ్యాఖ్యానించాడు. జడ్డూ మాదిరే అతడు కూడా త్రీ-డీ క్రికెటర్‌ అని పేర్కొన్నాడు.

కాగా అక్టోబరు 5 నుంచి భారత్‌ వేదికగా వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఐసీసీ ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం.. హైదరాబాద్‌, అహ్మదాబాద్‌లలో ఒక్కో మ్యాచ్‌లు ఆడనున్న దాయాది జట్టు.. చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలో రెండేసి మ్యాచ్‌లు ఆడనుంది.

జడ్డూలా త్రీడీ ప్లేయర్‌.. డేంజరస్‌ హిట్టర్‌
ఈ నేపథ్యంలో స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో ఆసీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ మాథ్యూ హెడెన్‌ పాకిస్తాన్‌కు ఈ మెగా ఈవెంట్‌లో షాదాబ్‌ ఖాన్‌ కీలకం కానున్నాడని పేర్కొన్నాడు. ‘‘షాబాద్‌ ఖాన్‌ అద్బుతమైన ఆటగాడు. తనకంటూ కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నాయి. జడ్డూ మాదిరే అతడు కూడా త్రీ- డైమెన్షనల్‌ క్రికెటర్‌.

ప్రత్యర్థి జట్టుకు వణుకు పుట్టించగల ప్రమాదకర హిట్టర్‌. బంతితోనూ అద్భుతంగా రాణించగలడు. అంతేకాదు అత్యద్భుతమైన ఫీల్డర్‌ కూడా! ఒక్కోసారి ఫీల్డింగ్‌ ఎఫర్ట్స్‌తో కూడా వరల్డ్‌కప్‌ గెలిచే అవకాశాలు ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు మరి! 

కాబట్టి.. ఈసారి పాకిస్తాన్‌కు ఈ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ కీలకం కానున్నాడని చెప్పవచ్చు’’ అని మాథ్యూ హెడెన్‌ వ్యాఖ్యానించాడు. కాగా 2017లో పాకిస్తాన్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన షాదాబ్‌ ఖాన్‌.. బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌. 

అందుకే అలా
పాక్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఈ 24 ఏళ్ల రైట్‌హ్యాండ్‌ బ్యాటర్‌ కీలక సభ్యుడు. ఇప్పటి వరకు ఆడిన 56 వన్డేల్లో 631 పరుగులు సాధించడంతో పాటు.. 73 వికెట్లు పడగొట్టాడు. కీలక సమయాల్లో జట్టును గెలిపించిన ఘనత అతడి సొంతం. ఈ నేపథ్యంలో బ్యాటర్‌, బౌలర్‌గా రాణించడంతో పాటు అద్భుత ఫీల్డింగ్‌ విన్యాసాలతో ఆకట్టుకుంటున్న షాబాద్‌ను హెడెన్‌ త్రీడీ ప్లేయర్‌గా అభివర్ణించాడు.

చదవండి: WC 2023: ఇప్పుడే అంతా అయిపోలేదు.. వెస్టిండీస్‌ అద్భుతాలు చేయగలదు! 
సచిన్‌, గంగూలీ, వీరూకు కలిసి రాలేదు! కానీ ధోని రూటే సపరేటు కదా! 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)