ఇంగ్లండ్‌కు భారీ షాక్‌

Published on Tue, 07/21/2026 - 17:35

ది  హండ్రెడ్ లీగ్‌-2026కు ముందు బర్మింగ్‌హామ్ ఫీనిక్స్‌కు భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. ఆ జ‌ట్టు కెప్టెన్‌, ఇంగ్లండ్ యువ సంచ‌ల‌నం జాక‌బ్ బెత‌ల్ గాయం కార‌ణంగా హండ్రెడ్ టోర్నీ నుంచి వైదొలిగాడు. భార‌త్‌తో జ‌రిగిన మూడో వ‌న్డేలో బెత‌ల్ మోకాలికి గాయ‌మైంది.

మ్యాచ్ ముగిసిన త‌ర్వాత‌ అత‌డిని అస్ప‌త్రికి త‌ర‌లించి స్కాన్ చేయ‌గా గాయం తీవ్ర‌మైన‌దిగా తేలింది. దీంతో నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని బెత‌ల్‌కు వైద్యులు సూచించిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే అత‌డు హెండ్రెడ్ లీగ్‌కు దూర‌మయ్యాడు.

ఆగ‌స్టు 19 నుంచి స్వ‌దేశంలో శ్రీలంక‌తో ప్రారంభ‌మ‌య్యే మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు కూడా బెత‌ల్ అందుబాటులో ఉండే సూచ‌న‌లు క‌నిపించడం లేదు. ఆ త‌ర్వాత జ‌రిగే టీ20ల్లో బెత‌ల్ ఆడే అవ‌కాశ‌ముంది.

కాగా ఈ యువ ఆట‌గాడు ప్ర‌స్తుతం ఇంగ్లండ్ జ‌ట్టులో కీల‌క స‌భ్యునిగా ఉన్నాడు. ఇటీవల భారత్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లోనూ బెతల్‌ సత్తాచాటాడు.  ఇక బెతల్‌ గైర్హజరీలో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టు కెప్టెన్‌గా డొనావన్‌ ఫెరీరా వ్యవహరించనున్నట్లు ఈసీబీ వర్గాలు వెల్లడించాయి.

బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టు ఇదే
రెహాన్ అహ్మద్, జో క్లార్క్, స్కాట్ కర్రీ, లారీ ఎవాన్స్, డొనోవాన్ ఫెరీరా, సాకిబ్ మహమూద్, మ్యాథ్యూ మోంట్‌గోమరీ, మిచ్ ఓవెన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, విల్ స్మీడ్, ఉస్మాన్ తారిక్, జోర్డాన్ థాంప్సన్, క్రిస్ వుడ్, సీన్ డిక్సన్, టామ్ హెల్మ్..

 

Videos

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)